Monkeypox Test Kit: మొట్ట మొదటి స్వదేశీ మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ విడుదల.. వివరాలు ఇవే..
దేశంలోనే మొట్టమొదటి ఆర్‌టి పిసిఆర్ కిట్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని మెడ్‌టెక్ జోన్‌లో ప్రవేశపెట్టారు. ట్రాన్స్ ఏషియా బయో మెడికల్స్ రూపొందించిన కిట్‌ను కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్
Monkeypox Test Kit: కరోనా మహమ్మారి తరువాత ఇప్పుడు మంకీపాక్స్ ప్రపంచాన్ని భయపెడుతోంది. భారత్‌లోనూ మంకీపాక్స్ కేసులు నమోదుకావటంతో అందరిలోనూ ఆందోళన పెరుగుతోంది. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ నిర్ధారణకు చేసే ఆర్టీపీసీఆర్ లాంటి టెస్ట్ కిట్‌ను దేశీయంగా తయారు చేయబడింది. దేశంలోనే మొట్టమొదటి ఆర్‌టి పిసిఆర్ కిట్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని మెడ్‌టెక్ జోన్‌లో ప్రవేశపెట్టారు. ట్రాన్స్ ఏషియా బయో మెడికల్స్ రూపొందించిన కిట్‌ను కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్ ఆవిష్కరించారు. Trans Asia Erba Monkeypox RT PCR కిట్ అత్యంత సున్నితమైనది.. అయినప్పటికీ ఉపయోగించడానికి సులభమైనదిగా స్పష్టం చేశారు. ఈ కిట్ సహాయంతో ఇన్ఫెక్షన్‌ను ముందుగానే గుర్తించవచ్చని ట్రాన్స్ ఏషియా వ్యవస్థాపక అధ్యక్షుడు సురేష్ వజిరాణి తెలిపారు. భారతదేశంలో ఇప్పటి వరకు 10 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయని WHO హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. గత వారంలో మంకీపాక్స్ కేసులు 20 శాతం పెరిగాయి. 92 దేశాల నుండి 35,000 కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్లు,12 మరణాలు నమోదయ్యాయి. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..“సుమారు 7,500 కేసులు గత వారం నివేదించబడ్డాయి. ఇది మునుపటి వారం కంటే 20 శాతం ఎక్కువ. మరో వారం క్రితం కంటే 20 శాతం ఎక్కువ.” దాదాపు అన్ని కేసులు యూరప్, అమెరికా నుండి వస్తున్నాయి. దాదాపు అన్ని కేసులు పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న వారిలో కనిపిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. మంకీపాక్స్ అనేది జంతువుల నుండి మానవులకు సంక్రమించే ఒక వైరస్, దాని లక్షణాలు మశూచిని పోలి ఉంటాయి. అయినప్పటికీ వ్యాధి వైద్యపరంగా తక్కువ తీవ్రతతో ఉంటుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి