Fake Police Station: వసూళ్ల దందా కోసం ఫేక్ పోలీస్ స్టేషన్ నడిపించిన కేటుగాళ్ల ముఠా.. చివరకు ఎలా దొరికారంటే..

ఆ గెస్ట్ హౌస్ ముందు ఓ గుర్తు తెలియని మహిళ, యువకుడు పోలీస్ డ్రెస్ లో రోడ్డుపై కనిపించారు. అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కూపీ లాగితే డొంక మొత్తం కదిలింది.

Fake Police Station: వసూళ్ల దందా కోసం ఫేక్ పోలీస్ స్టేషన్ నడిపించిన కేటుగాళ్ల ముఠా.. చివరకు ఎలా దొరికారంటే..
Fake Police
Follow us
Jyothi Gadda

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 19, 2022 | 4:35 PM

Fake Police Station: ఇప్పటి వరకు నకిలీ పోలీసులు, ఫేక్ ఆఫీసర్లు అనే మాటలు వినే ఉంటాం.. కానీ, ఓ జిల్లా కేంద్రంలో గత ఎనిమిది నెలలుగా నకిలీ పోలీస్‌స్టేషన్‌ నడుస్తున్నా ఎవరికీ తెలియనంతగా ఫోర్జరీ పెరిగిపోయింది. అలాంటి కేటుగాళ్ల ముఠా ఒకటి..ఏకాంగా నకిలీ పోలీస్‌ స్టేషన్‌నే ఏర్పాటు చేసింది. పోలీసుల వేషాల్లో ఎనిమిది నెలలుగా వసూళ్లకు పాల్పడుతోంది. ఈ సంఘటన బిహార్‌లోని బాంగా జిల్లాలో వెలుగు చూసింది. కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ వరకు ఇక్కడ అందరూ ఆన్‌ డ్యూటీ..ఇక వేషాలు, బిల్డప్‌ చూసి ఎవరైనా ఇట్టే మోసపోతారు.

బంకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ నేరస్థుడి అరెస్ట్ కోసం దాడులు నిర్వహించి పోలీస్ స్టేషన్‌కు తిరిగి వస్తున్నట్లు తెలిపారు. ఇంతలో బంకా గెస్ట్ హౌస్ ముందు ఓ గుర్తు తెలియని మహిళ, యువకుడు పోలీస్ డ్రెస్ లో రోడ్డుపై కనిపించారు. అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కూపీ లాగితే డొంక మొత్తం కదిలింది. ఈ కేసులో ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన ఐదుగురిలో ఒకరు మహిళా కూడా ఉంది. ఆమె కంప్లీట్‌గా బీహార్ పోలీస్‌ యూనిఫామ్‌లో కనిపిస్తుంది. ఆమె వద్ద పిస్టల్ కూడా ఉంది.

ఇకపోతే, గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు భోలా యాదవ్‌ ఓ గెస్ట్‌ హౌస్‌లో నకిలీ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. ముందుగా రూ.70వేలు వసూలు చేసి అనిత, జూలీ అనే ఇద్దరు మహిళల్ని పోలీసులుగా నియమించుకున్నాడు. మరో ముగ్గురిని తన గ్యాంగ్‌లో చేర్చుకుని డీఎస్పీ, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ లాంటి హోదాలు కట్టబెట్టాడు. వారికి యూనిఫాంలతో పాటు నాటు తుపాకీలు ఇచ్చాడు. వారు చెకింగ్‌ల పేరుతో భయపెట్టి ప్రజల నుంచి డబ్బులు వసూళు చేసేవారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన శంభు యాదవ్‌ నాటు తుపాకులతో ఉన్న నకిలీ పోలీసులను చూశారు. అతడికి అనుమానం వచ్చి ఆరా తీయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నకిలీ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఇక్కడ కొసమెరుపు ఎంటంటే..స్థానిక బంగా పోలీస్‌ స్టేషన్‌కు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ నకిలీ పోలీస్‌ స్టేషన్‌ ఉండటం గమనార్హం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి