Viral Video: ఇది స్విమ్మింగ్ పోటీ కాదు.. నిత్యావసరాలు కావాలంటే నదిని ఈదాల్సిందే..
హారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని సుర్గానా తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు సరైన సౌకర్యాలు, వంతెన లేక నిత్యవసర వస్తువుల కోసం నదిని దాటి వెళ్లాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి నిత్యావసరాల కోసం ఇలా..
viral News: చిన్న చిన్న గ్రామాల నుంచి ఏవైనా వస్తువులు కొనాలంటే పట్టణాలకు వెళ్తాం.. లంక గ్రామాల ప్రజలు అయితే పడవ మీద, పంటి మీదో వెళ్లి మళ్లీ తిరిగి వస్తారు. ఇటీవల కాలంలో గ్రామాల నుంచి నదులు దాటడానికి వంతెనలు నిర్మిస్తున్నారు. కాని మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని సుర్గానా తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు సరైన సౌకర్యాలు, వంతెన లేక నిత్యవసర వస్తువుల కోసం నదిని దాటి వెళ్లాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి నిత్యావసరాల కోసం ఇలా నదిని ఈదుతూ వెళ్తున్నామని చెప్పుకొస్తున్నారు గ్రామస్తులు. ఇటీవల భారీగా వర్షాలు కురుస్తుండటంతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీగా వరద నీరు నదిలోకి వచ్చి చేరుతోంది. అయినా నిత్యావసర వస్తువులు కావాలంటే తమ గ్రామంలో దొరకవని.. నది దాటి వెళ్లాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.
నీటి ప్రవహం ఎక్కువుగా ఉండటంతో ఈదే సమయంలో నీటి ప్రవహనికి మునిగిపోకుండా టైర్ల సహాయంతో నదిని దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది యువకులు దుస్తులు లేకుండా టైర్ల సహాయంతో నదిలో ఈత కొడుతున్నారు. వీరంతా నదిలో స్నానం చేస్తూ ఆడుకుంటున్నారేమోనని అందరూ అనుకుంటుండగా.. ఈవీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ వార్తా సంస్థ ఆగ్రామంలో సమస్యని తెలిపింది. వంతెన లేక గ్రామస్తులు నదిని దాటి వెళ్లాల్సి వస్తుందని పేర్కొంది. వర్షాలు ఎక్కువుగా కురిసే సమయంలో తాము ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుందని, తమకు సరైన సౌకర్యాలు కల్పించి.. వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
#WATCH | In absence of a bridge, residents of Surgana Taluka in Nashik, Maharashtra have to cross river each day for essentials
June, July, August are especially difficult as water flow increases due to rain. Nobody pays attention to us, there is no way for us to cross: A local pic.twitter.com/RUB7papJQ8
— ANI (@ANI) August 17, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..