Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణికులకు శుభవార్త.. ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వ ట్యాక్సీలు.. దేశంలోనే తొలిసారిగా..

దీనిని తిరిగి పథకాల అమలు, డ్రైవర్లు, ప్రయాణీకులకు ప్రొత్సహాకాలను ఇచ్చేందుకుగానూ ఉపయోగించనున్నారు. మహిళలు ప్రయాణాల్లో భద్రత కోసం ప్యానిక్ బటన్ వ్యవస్థ ఉంది.

ప్రయాణికులకు శుభవార్త.. ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వ ట్యాక్సీలు.. దేశంలోనే తొలిసారిగా..
Cab Service
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 19, 2022 | 2:21 PM

Online cab service: దేశంలో ఆన్ లైన్ ట్యాక్సీ సేవలు అనగానే మనకు గుర్తొచ్చేవి ఓలా, ఊబర్. ఇవికాక ఇప్పటి వరకు ఆన్ లైన్ ట్యాక్సీ సేవల్లో పలు ప్రైవేట్ సంస్థలు మాత్రమే కొనసాగుతున్నాయి. కానీ, దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆన్‌లైన్‌ ట్యాక్సీ సేవలను ప్రారంభించింది కేరళ ప్రభుత్వం. కేరళ సవారీ పేరిట ఆన్‌లైన్‌ ట్యాక్సీ సేవలను ప్రారంభించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకే ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా చెబుతోంది కేరళ సర్కార్‌. ప్రయాణికులకు న్యాయమైన, సరసమైన సేవతో పాటు ఆటోలు, ట్యాక్సీ వర్కర్లను ఆమోదయోగ్యమైన జీతం ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది.

కేరళ సవారీ ద్వారా ప్రభుత్వం నిర్ధారించిన ధరల్లోనే సురక్షితమైన ప్రయాణాన్ని కల్పిస్తుంది. ఇతర ఆన్‌లైన్ ట్యాక్సీలు 20 నుంచి 30 శాతం సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తుండగా, కేరళ సవారీ 8శాతమే వసూలు చేయనుంది. దీనిని తిరిగి పథకాల అమలు, డ్రైవర్లు, ప్రయాణీకులకు ప్రొత్సహాకాలను ఇచ్చేందుకుగానూ ఉపయోగించనున్నారు. మహిళలు ప్రయాణాల్లో భద్రత కోసం ప్యానిక్ బటన్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా ప్రమాద విషయం నేరుగా పోలీసు కంట్రోల్ రూంకు అనుసంధానమై ఉంటుంది. త్వరలోనే జీపీఎస్ ఇన్‌స్టాల్ చేసి, 24 గంటల కాల్ సెంటర్ సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే రాజధాని తిరువనంతపురం కార్పోరేషన్‌లోని 321 ఆటోరిక్షాలు, 228 కార్లు ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయ్యాయి. దశల వారీగా రాష్ట్రం మొత్తం అమలు చేసే ప్రణాళికలో ఉంది కేరళ ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి