Telangana: ఖాకీ చాటున గలీజు పనులు.. ఏసీబీ సోదాల్లో అక్రమ బుల్లెట్లు, లక్షల కొద్దీ నగదు పట్టివేత

అతనికి వెపన్ ఉన్నా.. నాలుగైదు బుల్లెట్స్ కంటే ఎక్కువ ఉండవు.. ఇన్ని బుల్లెట్లు మిస్ అయినా.. పోలీసు అధికారులు గుర్తించలేకపోయారు.. ఈ బుల్లెట్లు.. అసాంఘిక శక్తుల చేతిలో పడితే.. ఎవరూ బాధ్యత వహించాలి.

Telangana: ఖాకీ చాటున గలీజు పనులు.. ఏసీబీ సోదాల్లో అక్రమ బుల్లెట్లు, లక్షల కొద్దీ నగదు పట్టివేత
Police
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 4:00 PM

Telangana: చేసేదేమో..ప్రజల్ని రక్షించే పోలీస్‌ ఉద్యోగం..కానీ, ధనార్జనే ఇతగాడి ప్రధాన ధ్యేయం..ఉద్యోగం కన్నా..అక్రమ సంపదనపైనే దృష్టి.. పోలీసు స్టేషన్ కి కేసు వస్తే చాలు.. గద్ద లాగా వాలిపోతాడు. భయపెడుతూ.. కేసు పెడతనంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే స్టేషన్‌ బెయిల్‌ కోసం వచ్చిన వ్యక్తి వద్ద లంచం తీసుకొంటూ ఏసీబీకి దొరికిపోయాడు హెడ్‌కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌..దాంతో ఆరా తీసిన అధికారులకు.. చంద్రప్రకాశ్‌ అక్రమా లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి ఆయన ఇంట్లో సోదాలు చేయగా, అక్రమం గా నిల్వచేసిన 41 బుల్లెట్లు, రూ.4.5 లక్షల నగదు పట్టుబడటం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఏ బుల్లెట్లు ఎక్కడ నుంచి వచ్చాయే పోలీసులకే అంతుచిక్కటం లేదట. డిపార్ట్‌ మెంట్‌ మొత్తం అలెర్ట్‌ అయ్యారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. స్టేషన్ బెయిల్ విషయంలో ఓ హెడ్ కానిస్టేబుల్ రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డ సంఘటన పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టించింది. భరత్‌ అనే వ్యక్తి వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం వద్ద చికెన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 8న పక్కనే ఉన్న మరో వ్యాపారితో గొడవ జరిగింది.  ఇరువురు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా..పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 9న వేముల భరత్‌ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారిగా ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్ర ప్రకాశ్ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసు నోటీసులు ఇచ్చాడు. స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించినందుకు రూ.10వేలు ఇవ్వాలని హెడ్‌కానిస్టేబుల్‌ డిమాండ్‌ చేశాడు. తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. హెడ్ కానిస్టేబుల్ కు రూ.6వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ క్రమంలో ఏసీబీ అధికారుల పథకం ప్రకారం గురువారం పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న పండ్ల దుకాణం వద్దకు వచ్చిన హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌కు భరత్‌ డబ్బులు ఇస్తుండగా అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ లంచం తీసుకున్న సంఘటనలో ఇంకా ఎవరైనా పోలీసు అధికారులకు సంబంధం ఉందా అనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. హెడ్ కానిస్టేబుల్ ఇల్లును తనిఖీ నిర్వహించగా 9 ఎం ఎం బుల్లెట్, 303 బుల్లెట్ 41 లభించాయి . కొంత నగదు ను స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే.. ఇన్ని బుల్లెట్ లు ఎలా వచ్చాయి.. ఏ ఒక్క బుల్లెట్ ఎక్కువ ఉన్నా.. పోలీసు స్టేషన్ లో భద్రపర్చాలి. ఈ మధ్యలో.. ఆయుధాలు లేకుండా నే కానిస్టేబుళ్లు తిరుగుతున్నారు. అతనికి వెపన్ ఉన్నా.. నాలుగైదు బుల్లెట్స్ కంటే ఎక్కువ ఉండవు.. ఇన్ని బుల్లెట్లు మిస్ అయినా.. పోలీసు అధికారులు గుర్తించలేకపోయారు.. ఈ బుల్లెట్లు.. అసాంఘిక శక్తుల చేతిలో పడితే.. ఎవరూ బాధ్యత వహించాలి. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాయని… పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతను 1984 బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్ పలు పోలీస్ స్టేషన్లో మూడుసార్లు సస్పెండ్ కు గురి అయ్యాడు. ఏ.. పోలీసు స్టేషన్ లో పని చేసిన వసూళ్లలో.మహా ముదురు… అక్రమంగా ఇంట్లో ఉన్న బుల్లెట్లపై విచారణ ను వేగవంతం చేశారు ఉన్నతాధికారులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!