AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Breath: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు..

చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. ఈసమస్య వల్ల మనలో మనం కుమిలిపోతూ ఉంటాం.. నోటి దుర్వాసన వల్ల మన పక్కవారూ ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా పరిశుభ్రంగా ఉండకపోవడం..

Bad Breath: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు..
Bad Breath Problems
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 20, 2022 | 1:43 PM

Bad Breath: చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. ఈసమస్య వల్ల మనలో మనం కుమిలిపోతూ ఉంటాం.. నోటి దుర్వాసన వల్ల మన పక్కవారూ ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా పరిశుభ్రంగా ఉండకపోవడం.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో నోటి దుర్వాసన వస్తుంది. దీర్ఘకాల నోటి వ్యాధుల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. వెల్లులి, ఉల్లిపాయలు వంటి ఆహారాల్లో ఉండే దుర్వాసన గల నూనెలు.. ఊపిరితిత్తులకు చేరినప్పుడు నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో నోటి దుర్వాసన కలిగించకుండా ఉండే ఆహారాలు ఉన్నాయి. ఈఆహార పదార్థాలు నోటి దుర్వాసనతో పోరాడతాయి. అవెంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గ్రీన్ టీ: గ్రీన్ టీలో కాటెచిన్ అనే ఎనర్జిటిక్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది నోటి దుర్వాసన కలిగించే సల్ఫర్ సమ్మేళనాలను తగ్గించడం ద్వారా బ్యాక్టిరియాను నిరోధిస్తుంది.

కొన్ని రకాల పండ్లు: నిమ్మ, దానిమ్మ, యాపిల్, బత్తాయి, నారింజ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది బ్యాక్టిరియాను కంట్రోల్ చేయడానికి మాత్రమే కాకుండా.. చిగుళ్ల వ్యాధులు, చిగురువాపుతో పోరాడటానికి సహాయపడుతుంది.

పెరుగు: పెరుగులో ఫ్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి చెడు దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను అధిగమిస్తుంది. వీటిలో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉండటంతో శరీరంలో క్రిములు పెరగడాన్ని తగ్గిస్తుంది.

తులసి: తులసిలోని పాలీఫెనాల్స్ అనే సహజ అణువులు నోటి దుర్వాసనకు చికిత్స అందించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తులసిని ఏ విధంగా తీసుకున్నా.. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.

అల్లం: అల్లంలో ఉండే 6-జింజెరాల్ నోటిలోని సల్ఫర్ సమ్మేళనాల విచ్ఛినానికి సహాయపడే లాలాజల ఎంజైమ్ ను ఇస్తుంది. అల్లం లేదా అల్లం ఉపయోగించిన పదార్థాలను తీసుకుని నోటి దుర్వాసనను కంట్రోల్ చెసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..