AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinnamon: దాల్చిన చెక్కతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. మధుమేహ బాధితులకు మంచి ఉపశమనం..

గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. దాల్చిన‌చెక్క‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. రకర‌కాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు దాల్చిన చెక్క‌లో ఉన్నాయి.

Cinnamon: దాల్చిన చెక్కతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. మధుమేహ బాధితులకు మంచి ఉపశమనం..
Cinnamon
Jyothi Gadda
|

Updated on: Aug 21, 2022 | 8:14 AM

Share

Cinnamon : దాల్చిన చెక్క.. ఇది అందరికీ తెలిసిన మసాలా దినుసుల్లో ఒకటి.. వంట‌కాల్లో దాల్చిన చెక్క‌ను వాడ‌డం వ‌ల్ల వంటల‌ రుచి, వాస‌న పెరుగుతుంది. అంతేకాకుండా దీనిలో ఉండే ఔష‌ధ గుణాల కార‌ణంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. కానీ, ఆయుర్వేదం ప్రకారం..దాల్చిన చెక్క‌లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయని చెబుతారు. దాల్చిన చెక్కతో అనేక వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చని చెబుతున్నారు. అవేంటో, ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దాల్చిన చెక్కలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. ముఖ్యంగా త‌ల‌నొప్పితో బాధ‌ప‌డే వారు దాల్చిన చెక్క‌ను నీటితో అర‌గ‌దీసి ఆ మిశ్ర‌మాన్ని నుదుటి పై రాసి 5 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి నుండి ఉప‌శ‌మ‌నం కలుగుతుంది. గొంతు బొంగురు పోయిన‌ప్పుడు దాల్చిన చెక్కను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రిస్తూ రసాన్ని మింగ‌డం వ‌ల్ల గొంతు బొంగురు తగ్గిపోతుంది.ద‌గ్గు కూడా తగ్గుతుంది. క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్, అజీర్తి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు దాల్చిన చెక్క‌ను నేరుగా తిన్నా లేదా దాల్చిన చెక్క పొడిని నీటిలో క‌లుపుకుని తాగినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. ఆర్థ‌రైటిస్ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు .. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా నీళ్లు, తేనె క‌లిపి పేస్ట్‌లా చేసి నొప్పి ఉన్న చోట రాయాలి. ఇలా రాత్రి పూట చేయాలి. దీంతో మ‌రుస‌టి రోజు ఉద‌యం వ‌ర‌కు నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. కీళ్ల వాపులు, నొప్పులు త‌గ్గుతాయి.

మధుమేహం బాధితులకు కూడా దాల్చిన చెక్క ఔషధంలా పనిచేస్తుంది. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చ‌ని నీటితో కలిపి తాగాలి. అనంత‌రం 30 నిమిషాలు ఆగాక బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా 40 నుంచి 45 రోజుల పాటు చేస్తే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. అంతేగాకుండా గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. దాల్చిన‌చెక్క‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. రకర‌కాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు దాల్చిన చెక్క‌లో ఉన్నాయి. దీన్ని ఆహారంలో తీసుకోవడం ద్వారా ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగ‌వుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దీన్ని వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు, చుండ్రు తగ్గుతాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. దాల్చిన చెక్క పొడి, నిమ్మ‌ర‌సం తీసుకుని క‌లిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని మొటిమ‌లు, బ్లాక్ హెడ్స్‌పై రాత్రి పడుకునే ముందు అప్లై చేయాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ముఖాన్ని గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.. ఇలా వారం రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తే త‌ప్ప‌క ఫ‌లితం ఉంటుంది.

దాల్చిన చెక్కలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దంత సమస్యలను, చిగుళ్ళ వ్యాదులను, నోటి పుండ్లను నివారించడంలో గొప్ప పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా దాల్చిన చెక్క నోటి దుర్వాసనను నివారించడంలో సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది. అందుకే దీన్ని మౌత్ ఫ్రెషనర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాల్చిన నూనె నోటిలోని బాక్టీరియాను నిరోధించి నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..