Tea Health: ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా.. చాయ్ తాగేందుకు ఉత్తమం సమయం ఎప్పడో తెలుసా..
చాలా మందికి ఉదయాన్నే ముందుగా టీ (Tea) తాగడం అలవాటు. చాయ్ తాగనిదే ఏ పనీ ముందుకు సాగదు. టీ తాగితే వచ్చే హాయే వేరు. నూతనుత్సాహంతో టీ ప్రియులు రోజును గొప్పగా ప్రారంభిస్తారు. భారతదేశంలో హాటింగ్ డ్రింక్...
చాలా మందికి ఉదయాన్నే ముందుగా టీ (Tea) తాగడం అలవాటు. చాయ్ తాగనిదే ఏ పనీ ముందుకు సాగదు. టీ తాగితే వచ్చే హాయే వేరు. నూతనుత్సాహంతో టీ ప్రియులు రోజును గొప్పగా ప్రారంభిస్తారు. భారతదేశంలో హాటింగ్ డ్రింక్ గా పేరు గాంచిన చాయ్.. అందరి మనసు దోచుకుంటోంది. అయితే.. ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిదేనా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?. ఈ అంశంపై నిపుణులు (Health Experts) కొన్ని విషయాలను వెల్లడించారు. అవేంటంటే.. టీ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన పానీయం. ఇది రోగనిరోధక శక్తిని, జీవక్రియను పెంచేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు చురుకుగా ఉండేలా చేస్తాయి. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేడి వేడి చాయ్ తాగడం వల్ల పొట్టలో యాసిడ్ లెవెల్స్ పెరిగి, జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. తద్వారా అజీర్తి, గుండెల్లో మంట వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. తలనొప్పిని తగ్గించుకునేందుకు చాలా మంది టీ తాగుతారు. ఇది నొప్పి నుంచి ఉపశమనం ఇచ్చినప్పటికీ.. అధికంగా తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో గ్యాస్ ఏర్పడుతుంది. తరచు మూత్రవిసర్జనకు కారణమవుతుంది. డీ హైడ్రేషన్ కు దారి తీస్తుంది. రాత్రి వేళ కొన్ని గంటల పాటు నిద్రపోతాం. కాబట్టి ఆ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోలేం. పడుకునే ముందు తినే ఆహారం ఆ సమయంలో శక్తినిస్తుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే పొట్ట ఖాళీగా ఉంటుంది. దీంతో వేడి వేడి టీని పొద్దుటి పూటే తాగడం వల్ల డీహైడ్రేట్ అయ్యి, మలబద్ధకం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొట్టలోని ద్రవాల యాసిడ్ బేస్, ఆల్కలీన్ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్‌తో దిగువ ఛాతీలో నొప్పి కలుగుతుంది. దీంతో గుండెల్లో మంట వస్తుంది. అయితే.. టీ తాగడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం 3 గంటల అని నిపుణులు సూచిస్తున్నారు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి