CJI NV Ramana: కేంద్రానికి చెబితే ఓప్పుకోలేదు.. కీలక కామెంట్స్ చేసిన సీజేఐ ఎన్వీ రమణ..
CJI NV Ramana: న్యాయ వ్యవస్థలో భవనాల నిర్మాణం, కేంద్ర సహకారంపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి కాబట్టి..
CJI NV Ramana: న్యాయ వ్యవస్థలో భవనాల నిర్మాణం, కేంద్ర సహకారంపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి కాబట్టి ఆ బాధత్య కేంద్రమే తీసుకోవాలని తాను సూచించినా కేంద్రం నుంచి వ్యతిరేకత వచ్చిందన్నారు. అయినా ఏపీ, తమిళనాడు, బెంగాల్ సీఎంలు మాత్రమే కేంద్రమే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారన్నారు. విజయవాడలో జిల్లా కోర్టుల భవన సముదాన్ని ప్రారంభోత్సవం చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు విభజన తర్వాత ఏపీ అన్ని రకాలుగా వెనుకబడిపోయిందన్న ఆవేదన ప్రజల్లో ఉందన్నారు CJI జస్టిస్ ఎన్వీరమణ. ఇందులో కొంత వరకు నిజం ఉందన్నారు. ఈ సమయంలో కేంద్రం ఆర్థికంగా సహకారం ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే, అందరూ కష్టపడి పని చేయాలన్నారు.
కాగా, ఈ నెలలోనే రిటైర్ అవుతున్నానని చెప్పిన CJI ఎన్వీ రమణ.. తనకు ఇన్నాళ్లు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టిన దగ్గర నుంచి తన ఉన్నతికి, విజయానికి కృషి చేసిన వారిని గుర్తు చేసుకున్నారు చీఫ్ జస్టిస్. కాగా, ఈ సభలో మరో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. భవన నిర్మాణానికి సహకరించిన సీఎం జగన్‌ను సన్మానించడానికి న్యాయవాదులు ప్రయత్నించారు. అయితే ముఖ్యమంత్రి సున్నితంగా తిరస్కరించారు. సన్మానం కోసం వేసిన కుర్చీని కూడా వద్దని వారించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..