AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ‘నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు కాని మార్పు రావాలి’.. కౌలు భరోసా సభలో పవన్ కామెంట్స్..

Andhra Pradesh: 'నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు కాని మార్పు రావాలి' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం నాడు కడప జిల్లా సిద్ధవటంలో కౌలు భరోసా..

Pawan Kalyan: 'నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు కాని మార్పు రావాలి'.. కౌలు భరోసా సభలో పవన్ కామెంట్స్..
Pawan Kalyan
Shiva Prajapati
|

Updated on: Aug 20, 2022 | 7:28 PM

Share

Andhra Pradesh: ‘నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు కాని మార్పు రావాలి’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం నాడు కడప జిల్లా సిద్ధవటంలో కౌలు భరోసా యాత్రలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కుల, మత, వారసత్వ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయాలకు సంపూర్ణంగా అడ్డుకట్ట వేయలేమని, ఎంతో కొంత మార్పు తెచ్చేందుకే తాను కొత్తవారిని తీసుకొస్తున్నానని చెప్పారు. వైసీపీకే జగన్‌ సీఎం కానీ, ఏపీకి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ ప్రసంగం యధావిధిగా..

‘కొండల మధ్యనున్న సిద్దవఠంలో నేను పుట్టి ఉంటే ఎంత బాగపండేదో అనుకుంటున్నాను. ఇంత సుందరమైన ప్రాంతంలో ఈ స్థాయిలో కరువు ఉండటం బాధ కలిగిస్తోంది. సిద్దులు తిరిగిన ప్రాంతం ఇది. ఇలాంటి ప్రాంతంలో 190మంది కౌలు రైతులు చనిపోయారు. వారిని ప్రభుత్వం ఆదుకోకపోవడం దారుణం. జనసేన ఇచ్చే లక్ష రూపాయలు వారి జీవితాలు మారుస్తాయని కాదు.. మీకు భరోసాగా ఉన్నామని ఇస్తున్నాం. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ పోరాటాలు, ఆధిపత్యాల దగ్గరే ఆగిపోయాం. సీమ నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేసినా.. వారు బాగుపడ్డారు కానీ, ఇక్కడి ప్రజలు మాత్రం బాగుపడలేదు. రాష్ట్ర రాజకీయాలలో పిచ్చి ఎక్కువైంది. రాష్ట్రం కులాల సమూహం. నేనెప్పుడూ కులాల గురించి మాట్లాడలేదు. వైసీపీ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికే మేలు జరుగుతుందనే నానుడి ఉందఇ. కానీ, ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బాధితులే ఎక్కువగా ఉండటం భాద కలిగించే విషయం.’ అని అన్నారు.

‘నేను కులాలను రెచ్చగొట్టడానికి పార్టీ పెట్టలేదు. పద్యం పుట్టిన నేలపై మద్యం ఏరులై పారుతోంది. జగన్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. జగన్ వైసీపీకే ముఖ్యమంత్రి తప్ప.. రాష్ట్రానికి కాదు. కౌలురైతులకు ఎందుకు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు? రాష్ట్రంలో ఎంబీఏ చదివిన వ్యక్తికి ఉపాది లేదు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజలకు నా విజ్ఞప్తి. జనసేన ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు. నేను వ్యక్తులపై పోరాటం చేయను. భావంపై పోరాడుతాను. వైసీపీకి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు అన్నయ్య(చిరంజీవి ప్రజారాజ్యం) పార్టీలో పదవుల కోసం పని చేయలేదు. జాతీయ పార్టీలో కలిపినా మాట్లాడలేదు. పార్టీలో ఉన్న చాలా మంది నేతలు.. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయించారు. లేదంటే.. నేడు ప్రజారాజ్యం పార్టీ ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉండేది. ప్రాణం పోయినా నమ్మిన సిద్ధాంతాన్ని వీడను. వారసత్వ రాజకీయాలు రూపుమాపలేము కానీ, ఎంతో కొంత అడ్డుకట్ట వేయొచ్చు. మైదుకూరు నుంచి వస్తున్న ఒక వికలాంగ నాగేంద్ర కుటుంబాన్ని కూడా బెదిరించడానికి ఎలా మనసొచ్చింది. వైసిపి నేతలకు సిగ్గు ఉందా? సిగ్గు ఉంటే ఇలా బెదిరిస్తారా? నాగేంద్రకు ఉగ్యోగం ఇప్పించే భాద్యత నాది. ఒక చెల్లి అన్న కోసం తిరిగి ఆ చెల్లి వేరే పార్టి పెట్టారు. ఓకే కుటుంబం నుంచి ఒకే కులం నుంచి వచ్చి రెండు పార్టీలు పెట్టి వారే అధికారం కోసం తపన పడుతున్నారు. మరి రాయలసీమలో ఉన్న మాదిగ, మాల, బీసీ, బలిజల గురించి ఎవరైననా ఆలోచిచారా? నేను ఒక కులానికి మద్దతు ఇవ్వను, కొమ్ను కాయను. నేను కులాన్ని అమ్మడానికి, కార్యకర్తలను అమ్మటానికి రాలేదు. ఆంద్రప్రదేశ్‌లో నాయకులకు ఒక్కొక్కరికి కులపిచ్చి మొదలైంది . రెడ్డి సామాజిక వర్గాన్ని తగ్గించడం నా ఉద్దేశం కాదు. అన్ని కులాలను గుర్తించాలనేదే నా ఉద్దేశం. అన్ని కులాలకు సాధికారత రావాలి. పార్టీ నడపటానికి ఓర్పు, సహనం కావాలి.’ అని పవన్ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..