Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: తొక్కే కదా అని తీసి పారేస్తున్నారా.. ఆ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే పారేసినవి కూడా తిరిగి తెచ్చుకుంటారు

బంగాళాదుంప (Peel) అనేది వంటగదిలో ఉండే ముఖ్యమైన పదార్థం. వీటి ద్వారా చేసుకునే వంటలు చాలా రుచిగా ఉంటాయి. అంతే కాకుండా వీటిలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా...

Health: తొక్కే కదా అని తీసి పారేస్తున్నారా.. ఆ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే పారేసినవి కూడా తిరిగి తెచ్చుకుంటారు
Potato Peel
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 21, 2022 | 7:54 AM

బంగాళాదుంప (Peel) అనేది వంటగదిలో ఉండే ముఖ్యమైన పదార్థం. వీటి ద్వారా చేసుకునే వంటలు చాలా రుచిగా ఉంటాయి. అంతే కాకుండా వీటిలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బంగాళాదుంపలోని పోషకాలు చర్మ సమస్యలతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. సూర్యరశ్మి, కాలుష్యం, దుమ్ము ధూళి కారణంగా చర్మం దెబ్బతింటుంది. బంగాళాదుంపలో జింక్, ఐరన్, ప్రొటీన్, అజెలైక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. కాంతి వంతంగా మారేందుకు సహాయపడుతుంది. డార్క్ స్పాట్‌లను ప్రకాశవంతంగా మారుస్తుంది. బంగాళాదుంప రసాన్ని చర్మంపై ఏర్పడే నల్ల మచ్చలు, మొటిమల గుర్తులు డార్క్ ప్యాచ్‌లపై వేసుకుని అరగంట తర్వాత కడిగేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. చాలా మంది టాన్, స్కిన్ పిగ్మెంటేషన్‌ సమస్యల కోసం రసాయన బ్లీచ్ లను ఉపయోగిస్తారు. ఇవి బాగానే పని చేసినప్పటికీ.. దీర్ఘ కాలంలో తీవ్ర సమస్యలు కలిగిస్తాయి. అయితే.. బంగాళాదుంప తొక్కల్లో ఉండే విటమిన్లు, పోషకాలు చర్మ సౌందర్యానికి చాలా సహాయం చేస్తుంది.

బంగాళాదుంప తొక్కలు చర్మంపై ఏర్పడే నల్ల మచ్చలు, మొటిమల గుర్తులను తొలగిస్తుంది. ఇందులో ఉండే అజెలైక్ యాసిడ్ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. బంగాళాదుంపలో కాటెకోలేస్ వంటి బ్లీచింగ్ కాంపోనెంట్‌లు కూడా ఉన్నాయి. ఇది సన్‌స్పాట్‌లను, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. బంగాళాదుంపలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బంగాళాదుంప తొక్క చర్మ కణాలకు ప్రోటీన్‌ను అందిస్తుంది. బంగాళాదుంపలోని విటమిన్లు, ఐరన్, మినరల్స్ చర్మ ఛాయకు సహాయపడుతాయి. బంగాళాదుంప తొక్కను రెగ్యులర్ గా చర్మంపై అప్లై చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. బంగాళాదుంపలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి సహజమైన బ్లీచింగ్ గా పని చేస్తుంది. సన్‌టాన్‌ను తొలగించడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.

బంగాళాదుంపను శుభ్రంగా కడిగి, తొక్క తీసి వేయాలి. తొక్కను ముఖంపై సున్నితంగా రుద్దాలి. అలా 5-10 నిమిషాలు చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది సన్‌బర్న్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బంగాళదుంప తొక్కను టమోటా, పసుపుతో కలిపి ప్యాక్ లా తయారు చేసుకోవాలి. దీనిని వారానికి ఒకసారి అప్లై చేసి 10-15 నిమిషాల పాటు ఉంచాలి. బంగాళాదుంప తొక్కలను ఎండబెట్టి పొడి చేసి, అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఇది చర్మం కాంతివంతంగా మారడానికి సహాయపడతుంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్  న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి