AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sadaa: ప్రేమ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సదా.. కాబోయే భర్త అలా ఉండాలంటూ..

అలాగే తాజాగా హలో వరల్డ్ అనే సిరీస్ ద్వారా డిజిటిల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

Sadaa: ప్రేమ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సదా.. కాబోయే భర్త అలా ఉండాలంటూ..
Sadaa
Rajitha Chanti
|

Updated on: Aug 21, 2022 | 7:27 AM

Share

జయం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది సదా (Sadaa). వెళ్లవయ్యా వెళ్లు అంటూ సిగ్నేచర్ డైలాగ్‏తో తెలుగు వారి మనసులలో నిలిచిపోయింది. అందం, అభినయంతో మొదటి సినిమాతోనే అగ్రకథానాయికగా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించింది. అయితే సూపర్ హిట్స్ అందుకున్నప్పటికీ సదాకు ఇండస్ట్రీలో అంతగా ఆఫర్లు రాలేదు. దీంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవలే బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అలాగే తాజాగా హోల్డ్ వరల్డ్ అనే సిరీస్ ద్వారా డిజిటిల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

నటుడిగా ఇండస్ట్రీలో మనం బెస్ట్ ఇవ్వాలి. ప్రేక్షకులు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. జయం సినిమాను ఆదరించిన ప్రేక్షకులు ఔనన్నా కాదన్నా చిత్రాన్ని ఆదరించలేదు. ఇక ఈ సినిమా హిట్ కాలేదని డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం కరెక్ట్ కాదు. నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు చాలా మంది నన్ను పెళ్లి చేసుకోండి ప్లీజ్ అంటూ కామెంట్స్ చేశారు. మన జీవితం మీద అలాంటి కామెంట్స్ చేసే హక్కును వారికెవరిచ్చారు. అలాంటి వారికి నేనెందుకు సమాధానం చెప్పాలి. ప్రస్తుతం పది మంది పెళ్లి చేసుకుంటే అందులో 5 జంటలైనా పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నారా ? ఎవరూ హ్యాప్పీగా ఉండడం లేదు. ఎవరో నన్ను సంతోషంగా ఉంచాలని ఎందుకు అనుకోవాలి. ఎదుటి వ్యక్తిపై కావాలని ఒత్తిడి తీసుకువస్తారు. నా జీవితాన్న నేను సంతోషంగా గడపాలనుకుంటున్నాను. పార్టీలకు, పబ్స్ కు వెళ్లను. ఆల్కహల్, నైట్ ఔట్స్ చేయను. ఒక వ్యక్తిపై ఆధారపడి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేరు. నీ సంతోషం కోసం నువ్వు మరో వ్యక్తిపై నీ ఒత్తిడి కూడా అతనే భరించాలి. నేను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి శాఖాహారిగా ఉండాలి. ధనవంతుడు కానక్కర్లేదు. ఒకరిపై ఆధారపడకుండా ఉంటే చాలు. నా సంపాదనపైనో.. మరొకరి సంపాదన పైనో ఆధారపడకూడదనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది.