Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Bhumika: కుర్రకారు కలల సుందరి భూమిక పుట్టిన రోజు నేడు.. ఆర్మీ ఫ్యామిలీ నుంచి నటిగా పంజాబీ భామ ప్రయాణం..

చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని కోరుకునేది భూమిక. మోడలింగ్‌ తో పలు పలు యాడ్స్ లో నటించిన భూమిక అతి తక్కువ సమయంలోనే చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.

Happy Birthday Bhumika: కుర్రకారు కలల సుందరి భూమిక పుట్టిన రోజు నేడు.. ఆర్మీ ఫ్యామిలీ నుంచి నటిగా పంజాబీ భామ ప్రయాణం..
Bhumika Chawla
Follow us
Surya Kala

|

Updated on: Aug 21, 2022 | 8:43 AM

Happy Birthday Bhumika: నేడు నటి, నిర్మాత భూమికా చావ్లా పుట్టినరోజు. వెండి తెరపై చిన్న చిరునవ్వుతో కుర్రకారు మదిని దోచిన భూమిక చావ్లా ఈరోజు 45వ పుట్టిన రోజుని జరుపుకుంటుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన లక్కీ గర్ల్ భూమిక  2007లో యోగా టీచర్ భరత్ ఠాకూర్‌ని వివాహం చేసుకుని స్థిరపడింది. ఇద్దరూ పెళ్లికి ముందు 4 సంవత్సరాలు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు. పెళ్ళిపిల్ల తర్వాత భూమిక కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నది. అయితే బాలీవుడ్ లో తెరకెక్కిన ధోని బయోపిక్ MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ధోని అక్క జయంతిగా నటించింది. అనంతరం టాలీవుడ్ లో కూడా నాని సినిమాలో ఎంసీఏ లో నానికి వదినగా నటించి అలరించింది. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత 2022లో ఆపరేషన్ రోమియోలో నటించింది.

భూమికా చావ్లా పంజాబీ కుటుంబానికి చెందిన అమ్మాయి. భూమిక తండ్రి సైన్యంలో పెద్ద లేబుల్ ఆఫీసర్. ఢిల్లీలో జన్మించిన భూమిక ప్రాథమిక విద్యాభ్యాసంకూడా ఢిల్లీలోనే చేసింది. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని కోరుకునేది భూమిక. మోడలింగ్‌ తో పలు పలు యాడ్స్ లో నటించిన భూమిక అతి తక్కువ సమయంలోనే చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. తెలుగులో సుమంత్ హీరోగా నటించిన యువకుడు సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించింది. అదే సమయంలో GTV షో “హిప్-హిప్ హుర్రే” కి హోస్ట్ గా చేసింది.

భూమిక సినిమా ప్రయాణం 2000 సంవత్సరంలో మొదలైంది. భూమిక తెలుగులో “యువకుడు” చిత్రంలో కనిపించింది. ఈ సినిమాలోని భూమిక నటన, నవ్వు, క్యూట్ నెస్ అప్పటి యువకులను ఆకట్టుకుంది. కలల సుందరిగా మారింది. దీంతో దక్షిణాది సినిమాల్లో వరస ఆఫర్లు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ తో ఖుషి, మహేష్ బాబు తో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. దక్షిణాది సినిమాల్లో సక్సెస్ అయ్యాక బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. దర్శకుడు సతీష్ కౌశిక్ తెరకెక్కించిన తేరే నామ్ చిత్రం భూమిక కెరీర్‌కు సరికొత్త బాటలు వేసింది.

ఇవి కూడా చదవండి

హిందీలో మొదటి సినిమా సూపర్ హిట్ అయిన లక్కీ హీరోయిన్లలో భూమికా చావ్లా ఒకరు. 2003 సంవత్సరంలో తేరే నామ్‌ సినిమాలో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించింది. భూమిక అందమైన ముఖం, అమాయకత్వం బీ టౌన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘తేరే నామ్ గర్ల్’గా ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా బడ్జెట్‌కి రెండింతలు-మూడింతలు వసూళ్లు చేసి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. దీని తర్వాత భూమిక తన తదుపరి బాలీవుడ్ చిత్రంలో అభిషేక్ బచ్చన్‌తో  “రన్” చిత్రంలో నటించింది. అయితే భూమిక ఎంత త్వరగా స్టార్‌డమ్‌ని సంపాదించిందో.. అంత త్వరగా కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. పెళ్లి తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన భూమిక తెలుగు, తమిళం, పంజాబీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది.  మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వడానికి ట్రై చేస్తోంది.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..