Samantha: ఆ విషయంలో దేశంలోనే నెంబర్ వన్‍గా సమంత.. బాలీవుడ్ హీరోయిన్లకు వెనక్కునెట్టిన సామ్..

కిల్లింగ్ ఎక్స్‏ప్రెషన్స్, మాస్ డాన్స్‏తో కుర్రకారు మతిపోగొట్టింది. ఇక ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సమంత..తాజాగా ఓ అరుదైన గౌరవం అందుకుంది. దేశంలోనే మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్‏గా నిలిచింది.

Samantha: ఆ విషయంలో దేశంలోనే నెంబర్ వన్‍గా సమంత.. బాలీవుడ్ హీరోయిన్లకు వెనక్కునెట్టిన సామ్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 21, 2022 | 6:55 AM

ఏమాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ సమంత (Samantha). మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. బృందావనం, ఈగ, దూకుడు, అత్తారింటికి దారేది, మహానటి సినిమాల్లో నటించి తెలుగులో టాప్ హీరోయిన్‏గా దూసుకుపోయింది. ఇక అక్కినేని నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల అనంతరం సామ్ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. విడాకుల ప్రకటన అనంతరం ఆమె షేర్ చేసే ప్రతి పోస్ట్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‏తో పాన్ ఇండియా స్టార్‏గా మారిన సామ్.. పుష్పలో స్పెషల్ సాంగ్‏తో బాక్సాఫీస్‏ను షేక్ చేసింది. కిల్లింగ్ ఎక్స్‏ప్రెషన్స్, మాస్ డాన్స్‏తో కుర్రకారు మతిపోగొట్టింది. ఇక ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సమంత..తాజాగా ఓ అరుదైన గౌరవం అందుకుంది. దేశంలోనే మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్‏గా నిలిచింది.

ప్రముఖ మీడియా సంస్థ ormax india నిర్వహించిన సర్వేలో జూలై నెలకు సంబంధించి దేశంలోనే మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్ ఎవరు ? అని ఒక సర్వే నిర్వహించింది. అయితే ఎప్పుడూ ఈ సర్వేలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ముందుంటారు. కానీ ఈసారి వారందరిని వెనక్కి నెట్టి దేశంలోనే మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్ గా నిలిచింది సమంత. ఇక సామ్ తర్వాత అలియా భట్, నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకొనే, కీర్తి సురేష్, పూజా హెగ్డే, రష్మిక, కత్రినా కైఫ్, కియారా అద్వానీ తదితరులున్నారు. ప్రస్తుతం సమంత.. యశోద, ఖుషి సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న శాకుంతలం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తాప్సీ నిర్మాణంలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..