Liger Pre Release Event: మళ్లీ గుంటూరుకు వస్తా.. కుమ్మేసుకుందాం.. అనన్య క్యూటీ స్పీచ్
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం లైగర్. డైరెక్టర్ పూరి, రౌడీ హీరో విజయ్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ ఆగస్ట్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.
Liger Pre Release Event: దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం లైగర్. డైరెక్టర్ పూరి, రౌడీ హీరో విజయ్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ ఆగస్ట్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. విజయ్ బాక్సర్ గా కనిపించనున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో దుమ్మురేపుతోన్న లైగర్ టీమ్.. పలు నగరాల్లో పర్యటిస్తూ సందడి చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో లైగర్ టీమ్ అనన్య, విజయ్ దేవరకొండ, పూరిజగన్నాథ్, ఛార్మీ కౌర్ సందడి చేశారు. ఈ ఈవెంట్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే మాట్లాడుతూ..
తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడి ఆకట్టుకుంది అనన్య .. అలాగే దేశ ముదురు సినిమాలోని డైలాగ్ చెప్పి ఆకట్టుకుంది అనన్య. ఇది నా మొదటి సినిమా తెలుగులో.. బెస్ట్ టీమ్ తో కలిసి పని చేశా.. మా సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత మళ్లీ గుంటూరుకు వస్తా.. కుమ్మేసుకుందాం అంటూ చెప్పుకొచ్చింది అనన్య..