Neha Shetty: రాధికతో అట్లుంటది మరి.. జీవితంలో గెలవాలంటే ఏం చేయాలి, తన బ్యూటీ సీక్రెట్‌ ఏంటో చెప్పిన నేహా..

Neha Shetty: ఆకాశ్‌ పూరి హీరోగా తెరకెక్కిన మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి నేహా శెట్టి. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీ నటిగా మంచి పేరు సంపాదించుకుంది...

Neha Shetty: రాధికతో అట్లుంటది మరి.. జీవితంలో గెలవాలంటే ఏం చేయాలి, తన బ్యూటీ సీక్రెట్‌ ఏంటో చెప్పిన నేహా..
Neha Shetty
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 7:36 PM

Neha Shetty: ఆకాశ్‌ పూరి హీరోగా తెరకెక్కిన మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి నేహా శెట్టి. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీ నటిగా మంచి పేరు సంపాదించుకుంది. అనంతరం గల్లీ రైడీ, మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ సినిమాల్లో నటించి మెప్పించిన నేహా.. 2022లో వచ్చి డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. రాధిక పాత్రలో ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేసింది. తనదైన క్యూట్ యాక్టింగ్‌, డైలాగ్‌ డెలివరీతో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందీ బ్యూటీ.

ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో నేహా శెట్టి క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తన లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన నేహాశెట్టి.. తన బ్యూటీ సీక్రెట్‌ ఎంటో చెప్పేసింది. తన స్లిమ్‌, గ్లామర్‌ సీక్రెట్‌ ప్రత్యేకంగా ఎలాంటి పనులు చేయనని కేవలం ఇంటి ఫుడ్‌ మాత్రమే తింటానని చెప్పింది. తన బ్యూటీ సీక్రెట్‌కు అదే కారణమని చెప్పుకొచ్చింది.

ఇక సినిమాలు, పనులతో వచ్చే ఒత్తిడిని ఎలా తట్టుకుంటున్నారన్న ప్రశ్నకు మెడిటేషన్‌ సొల్యుషన్‌ సమాధానం అని చెప్పుకొచ్చింది. జీవితంలో విజయం సాధించాలంటే ఎలాంటి ఫార్ములాలు ఉండవని కష్టపడి చేస్తూ, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలని అప్పుడే విజయం సొంతమవుతుందని నేహా తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ