Vijay Deverakonda: అనన్య లాంటి పిల్లలు పుడితే భరించడం కష్టమే.. లైగర్‌ బాయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

Liger Movie: టాలీవుడ్‌ రౌడీ విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తోన్న చిత్రం లైగర్‌. అనన్యాపాండే (Ananya Panday) హీరోయిన్‌గా నటిస్తుండగా డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

Vijay Deverakonda: అనన్య లాంటి పిల్లలు పుడితే భరించడం కష్టమే.. లైగర్‌ బాయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
Liger Vijay Deverakonda
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 7:36 PM

Liger Movie: టాలీవుడ్‌ రౌడీ విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తోన్న చిత్రం లైగర్‌. అనన్యాపాండే (Ananya Panday) హీరోయిన్‌గా నటిస్తుండగా డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. ఓవైపు ప్రధాన నగరాల్లో ఫ్యాన్‌డమ్‌ టూర్‌లు నిర్వహిస్తూనే, వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక నేడు గుంటూరులో జరిగే లైగర్‌ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. కాగా మూవీ ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు విజయ్‌, అనన్య. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు.

నా దృష్టిలో అతనే నిజమైన ఫైటర్‌..

ఇవి కూడా చదవండి

మీ దృష్టిలో రియల్‌ ఫైటర్‌ అన్న ప్రశ్నకు ‘ ప్రేమ, డబ్బు, గౌరవం, సంతోషం.. ఇలా సమాజంలో మనకంటూ ఓ స్థానం సొంతం చేసుకోవడానికి పోరాటం చేసే వ్యక్తే నా దృష్టిలో నిజమైన ఫైటర్‌. నా పోరాటం కూడా అదే’ అని సమాధానమిచ్చాడు రౌడీబాయ్‌. అలాగే కెరీర్‌ ముగింపు దశకు వచ్చేసరికి తననెవరూ గుర్తుపెట్టుకోవాలనుకోవడం లేదన్నాడు విజయ్‌. దయచేసి అప్పుడు అందరూ తనను మర్చిపోవాలని, జీవితాన్ని బాగా ఎంజాయ్‌ చేయాలని ఫ్యాన్స్‌కు సూచించాడు. ఇక అనన్యలో నచ్చని విషయాలపై మాట్లాడుతూ.. ‘ అనన్య ఎప్పుడూ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. తనలో నాకు నచ్చనిది అదే. ఇలాంటి అల్లరి పిల్ల నాకు పుడితే ఏం చేయాలోనని భయమేస్తోంది. చిన్నతనంలో అనన్య ఎలా ప్రవర్తించేదో తెలియదు.. కానీ, తనను భరిస్తున్నందుకు చిక్కీ సర్‌ (తండ్రి చుంకీపాండే‌), భావన మేడమ్‌కు నా సానుభూతి తెలియజేస్తున్నా’ అని సరదాగా చెప్పుకొచ్చాడు విజయ్‌. అదే సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి అనన్య ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుందని, ఇది ఆమెలో తనకు బాగా నచ్చే లక్షణమన్నాడు లైగర్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..