Vijay Deverakonda: సుకుమార్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ సినిమా.. క్లారిటీ ఇచ్చిన రౌడీ హీరో..
ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం మరో ఐదు రోజుల్లో (ఆగస్ట్ 25)న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. మరోవైపు లైగర్ ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి.
ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ లైగర్ (Liger) ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపించనుండగా.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం మరో ఐదు రోజుల్లో (ఆగస్ట్ 25)న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. మరోవైపు లైగర్ ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. అయితే చాలాకాలంగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీరిద్దరి ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో సుక్కు, విజయ్ సినిమాపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల లైగర్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న విజయ్ సుకుమార్ సినిమాపై క్లారిటీ ఇచ్చేశారు. తమ ప్రాజెక్ట్ రావడం వాస్తవమే అని.. కాస్త సమయం పడుతుందని తెలిపారు.
విజయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత మా ఇద్దరి మూవీ పట్టాలెక్కనుంది అని తెలిపారు. లైగర్ సినిమాతో విజయ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో బీటౌన్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ ఖుషి సినిమా చేస్తున్నారు. ఇందులో రౌడీ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.