Viral Photo: బోసినవ్వుల కుర్రాడు ఒకప్పుడు లవర్‏బాయ్.. అందం, అమాయకత్వంతో అమ్మాయిలను ఫిదా చేశాడు.. గుర్తుపట్టండి..

ఇటీవలే ఓ సూపర్ హిట్ చిత్రంలో నటించి మెప్పించాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఎవరో గుర్తుపట్టండి

Viral Photo: బోసినవ్వుల కుర్రాడు ఒకప్పుడు లవర్‏బాయ్.. అందం, అమాయకత్వంతో అమ్మాయిలను ఫిదా చేశాడు.. గుర్తుపట్టండి..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 20, 2022 | 7:18 PM

పైన ఫోటోలో బోసినవ్వులతో చూపుతిప్పుకోనివ్వకుండా ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఒకప్పుడు యూత్‏లో యమ క్రేజ్ ఉన్న లవర్ బాయ్. ఈ కుర్రాడికి ముఖ్యంగా అమ్మాయిలలో ఫాలోయింగ్ ఎక్కువే. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నోడు.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరో.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. హీరోగానే కాకుండా వైవిధ్యభరితమైన పాత్రలలో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవలే ఓ సూపర్ హిట్ చిత్రంలో నటించి మెప్పించాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఎవరో గుర్తుపట్టండి.

ఆ ఫోటోలోని చిన్నోడు.. ప్రేమకథ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి హీరోగా మెప్పించిన అక్కినేని కుర్రాడు సుమంత్ కుమార్. యువకుడు, పెళ్లి సంబంధం, సత్యం, ధన 51, గౌరి, మహానంది వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలం తర్వాత మళ్లీ రావా, మళ్లీ మొదలైంది సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సుమంత్.. ఇటీవల సీతారామం సినిమాలో కీలకపాత్రలో కనిపించాడు. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది సీతారామం. ఈ మూవీలో సుమంత్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sumanth (@sumanth_kumar)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.