Liger Pre Release Event Highlights : లైగర్ ఆగయా.. ఛార్మింగ్ లుక్‏లో ఎంట్రీ ఇచ్చిన విజయ్.. రచ్చ రచ్చ చేసిన ఫ్యాన్స్ ..

Rajitha Chanti

|

Updated on: Aug 20, 2022 | 10:02 PM

అలాగే ఈ చిత్రంతో దక్షిణాదికి పరిచయం కాబోతుంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Liger Pre Release Event Highlights : లైగర్ ఆగయా.. ఛార్మింగ్ లుక్‏లో ఎంట్రీ ఇచ్చిన విజయ్.. రచ్చ రచ్చ చేసిన ఫ్యాన్స్ ..
Liger

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న చిత్రం లైగర్ (Liger). ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ తీసుకురాగా.. సాంగ్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో విజయ్ మొదటిసారి బాక్సార్‏గా కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రంతో దక్షిణాదికి పరిచయం కాబోతుంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఈరోజు (ఆగస్ట్ 20న) సాయంత్రం 6 గంటలకు గుంటూరు మోతివాడలోని చలపతి ఇన్‏స్టిట్యూట్‏లో లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. లైగర్ చిత్రయూనిట్ కోసం వేదిక వద్దకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Aug 2022 09:57 PM (IST)

    స్క్రిప్ట్ వినగానే అదే మాట అన్నాను.. విజయ్.

    లైగర్ స్క్రిప్ట్ వినగానే నా నుంచి వచ్చిన ఫస్ట్ మాట మెంటల్. ఎప్పుడెప్పుడు మీ ముందుకు ఈ సినిమా తీసుకురావాలని ఎదురుచూశాను అంటూ చెప్పుకొచ్చారు.

  • 20 Aug 2022 09:56 PM (IST)

    ముందుకు రావాలంటూ అభిమానుల అరుపులు..

    విజయ్ స్పీచ్ ఇస్తున్న సమయంలోనే వేదిక వద్దకు దూసుకువచ్చారు. దీంతో స్జేజ్ వద్ద తొక్కిసలాట నెలకొనే పరిస్థితి నెలకొంది. జాగ్రత్తగా అభిమానులను కోరారు విజయ్.

  • 20 Aug 2022 09:54 PM (IST)

    స్టేజ్ పైకీ దూసుకువచ్చిన అమ్మాయిలు..

    విజయ్ స్పీచ్ ఇస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా ఓ అమ్మాయి స్టేజ్ పైకి వచ్చేసింది. విజయ్ అంటూ అరుస్తూ సెల్ఫీ ఇవ్వాలని కోరడంతో బౌన్సర్స్ మధ్య సెల్ఫీ ఇచ్చారు విజయ్.

  • 20 Aug 2022 09:52 PM (IST)

    ప్రేమను మర్చిపోలేను.. విజయ్..

    ఇండియాలో ఏ ఊరు వెళ్లిన చెప్పలేనంత ప్రేమను ఇస్తున్నారు. ఎప్పటికీ మర్చిపోలేను. మీ ప్రేమకు నేను కేవలం గుర్తుండిపోయే సినిమా ఇవ్వాలి. అదే లైగర్.

  • 20 Aug 2022 09:50 PM (IST)

    ఆ మాట అనగానే హర్ట్ అయ్యాను. పూరి

    ముంబైలో ఓ జర్నలిస్ట్ మైక్ టైసన్ ఎవరు అని అడిగారు. ఆ మాటకు చాలా హర్ట్ అయ్యాను. మైక్ టైసన్ గురించి తెలియకపోతే.. గూగుల్ చేయండి అన్నారు.

  • 20 Aug 2022 09:49 PM (IST)

    అమ్మాయిలే ఎక్కువ.. పూరి

    ఈ వేడుకకు అబ్బాయిలు కాకుండా.. అమ్మాయిలే ఎక్కువగా వచ్చారు. ఈ సినిమాలో విజయ్ ఇరగదీశాడు. అనన్య, రమ్యకృష్ణ ఉతికి ఆరేశారు అన్నారు పూరి జగన్నాథ్.

  • 20 Aug 2022 09:45 PM (IST)

    సినిమా సక్సెస్ మీట్‏కు వచ్చినట్లుంది.. పూరి..

    అనంతరం డైరెక్టర్ పూరి మాట్లాడుతూ.. ఇక్కడకు వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే సినిమా ప్రమోషన్స్ కోసం కాదు..సక్సెస్ మీట్‏కు వచ్చినట్లు ఉందన్నారు.

  • 20 Aug 2022 09:44 PM (IST)

    జై బాలయ్య..ఛార్మి.

    ఆగస్ట్ 25న లైగర్.. వాట్ లాగా దేంగే.. జై బాలయ్య జై బాలయ్య అంటూ స్పీచ్ ముగించేసింది.

  • 20 Aug 2022 09:42 PM (IST)

    తెలుగులో స్పీచ్ అదరగొట్టిన అనన్య..

    నమస్కారం అంటూ తెలుగులో స్పీ్చ్ స్టార్ట్స్ చేసిన అనన్య.. తెలుగు సినిమా ప్రేక్షకులు అంటే చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చింది.

  • 20 Aug 2022 09:40 PM (IST)

    వేదికపై లైగర్ టీం..

    స్టేజ్ పై లైగర్ టీం ఫోటోలకు ఫోజులిచ్చారు. అనంతరం స్టేజ్ పైకి అభిమానులు దూసుకువచ్చారు.

  • 20 Aug 2022 09:36 PM (IST)

    లైగర్ ఆగయా..

    భారీ బందోబస్తు మధ్య లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక వద్దకు చేరుకున్నాడు విజయ్ దేవరకొండ. ఛార్మ్ అండ్ హ్యాండ్సమ్ లుక్‏లో రౌడీ.

  • 20 Aug 2022 09:32 PM (IST)

    విజయ్ ఎన్నో కష్టాలు పడ్డారు.. విషు..

    సినీ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని హీరోగా మారాడు విజయ్. లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోగా మారడం అంటే మాములు విషయం కాదు. ఎప్పుడూ అలర్ట్‏గా ఇప్పుడు లైగర్‏గా క్రేజ్ సంపాదించుకున్నాడని అన్నారు విషు.

  • 20 Aug 2022 09:30 PM (IST)

    సినిమాపై ఛార్మికి పిచ్చి..

    సినిమాపై ఉన్న ఆసక్తితో పూరి కనెక్ట్స్ స్థాపించి సూపర్ హిట్ చిత్రాలను నిర్మిస్తుంది ఛార్మి. సినిమా కోసం ఎన్నో కష్టాలు పడుతుంది. హాట్సాఫ్ అని అన్నారు విషు..

  • 20 Aug 2022 09:28 PM (IST)

    అనన్య ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.. విషు..

    ఓ స్టార్ హీరోయిన్‏కు కావాల్సిన లక్షణాలు అన్ని అనన్యకు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇండస్ట్రిని షేక్ చేస్తుందన్నారు ప్రతినాయకుడు విషు.

  • 20 Aug 2022 09:12 PM (IST)

    ప్రాణం పెట్టి లైగర్ తీశాం.. విజయ్

    లైగర్ చిత్రాన్ని ప్రాణం పెట్టి తీశాం. కొడుకు కోసం తల్లి పోరాటం.. ఆమె ఆశయం కోసం కొడుకు ఆరాటం. అమ్మాయితో ప్రేమలో పడిన ఆ అబ్బాయి ఎలా గమ్యాన్ని చేరాడనేది స్టోరీ అంటూ చెప్పుకొచ్చారు.

  • 20 Aug 2022 08:54 PM (IST)

    అనన్య ఎంట్రీ..

    బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే బందోబస్తు మధ్య వేదక వద్దకు చేరుకుంది. పింక్ లెహాంగాలో మరింత అందంగా మెరిసిపోయింది. ర్యాంప్ వాక్ చేస్తూ అభిమానులకు హాయ్ చెప్పింది.

  • 20 Aug 2022 08:51 PM (IST)

    యాటిట్యూడ్‏కు ఫిదా..

    విజయ్ దేవరకొండ యాటిట్యూడ్కా బాప్ అంటూ అమ్మాయిలు అరుస్తూ రచ్చ చేస్తున్నారు.

  • 20 Aug 2022 08:48 PM (IST)

    పూరి, ఛార్మి ఎంటర్..

    లైగర్ వేదిక వద్దకు విచ్చేశారు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ప్రొడ్యూసర్ ఛార్మి. రావడంతో స్టేజ్ పైకి వెళ్లి సందడి చేశారు.

  • 20 Aug 2022 08:43 PM (IST)

    లైగర్ ఈవెంట్‏లో బాలయ్య ఫ్యాన్స్ సందడి..

    లైగర్ ప్రీరిలీజ్ వేడుకలో బాలయ్య ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. జై బాలయ్య.. విజయ్ అంటూ అరుపులతో రచ్చ చేస్తున్నారు

  • 20 Aug 2022 08:38 PM (IST)

    అదిరిపోయిన దేవరకొండ ప్రోమో..

    నటుడిగా ఎదగలన్నా తపనతో సినీరంగ ప్రవేశం చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అర్జున్ రెడ్డి చిత్రంతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు విజయ్. లైగర్ ప్రీ రిలీజ్ వేదికపై విజయ్ స్పెషల్ ప్రోమో అదిరిపోయింది.

  • 20 Aug 2022 08:30 PM (IST)

    వేదిక వద్ద అభిమానుల తాకిడి.. భారీగా పోలీసు బందోబస్తు..

    లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దకు అభిమానుల తాకిడి పెరిగిపోతుంది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

  • 20 Aug 2022 08:24 PM (IST)

    రూ. 200 కోట్ల ఆఫర్ వదిలేశాం..

    లైగర్ సినిమా కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ రూ. 200 కోట్లు ఆఫర్ చేసిందట. కానీ థియేటర్లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు రిజెక్ట్ చేశారని ప్రొడ్యూసర్ ఛార్మి చెప్పారు.

  • 20 Aug 2022 08:12 PM (IST)

    తల్లి కల కోసం యువకుడి పోరాటం..

    కొడుకుని ఛాంపియన్‏గా చూడటానికి ఆ తల్లి ఏం చేసింది.. అమ్మ కల కోసం కొడుకు ఎంతలా కష్టపడ్డాడు.. ఏ స్థాయికి వెళ్లాడు అనేది లైగర్ చిత్రంలో చూడొచ్చు అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్.

  • 20 Aug 2022 08:02 PM (IST)

    అర్జున్ రెడ్డి హావా..

    అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు విజయ్. ఆ తర్వాత గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ చిత్రాలతో అలరించిన ఈ హీరో.. ఇప్పుడు లైగర్‏తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

  • 20 Aug 2022 07:47 PM (IST)

    ఉత్తరాదిలో లైగర్ క్రేజ్..

    ఉత్తరాది ప్రధాన నగరాల్లో విజయ్ కు ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే. రౌడీని చూసేందుకు వందలాది మంది అభిమానులు తరలివచ్చారు.

  • 20 Aug 2022 07:30 PM (IST)

    అక్టీ పక్టీ సాంగ్ క్రేజ్..

    ఇప్పటికే యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది అక్టీ పక్టీ సాంగ్. విజయ్, అనన్య మాస్ డ్యాన్స్‏కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

  • 20 Aug 2022 07:16 PM (IST)

    లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద ఫ్యాన్స్ హంగామా మొదలైంది. విజయ్ కోసం అమ్మాయిలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రౌడీ అంటూ అరుపులు… కేకలతో రచ్చ చేస్తున్నారు.

    లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద ఫ్యాన్స్ హంగామా మొదలైంది. విజయ్ కోసం అమ్మాయిలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రౌడీ అంటూ అరుపులు… కేకలతో రచ్చ చేస్తున్నారు.

  • 20 Aug 2022 07:03 PM (IST)

    ఈవెంట్ షూరు..

    గుంటూరులో లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ప్రారంభమైంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు .. వేదిక వద్ద అరుస్తూ రచ్చ చేస్తున్నారు.

  • 20 Aug 2022 06:58 PM (IST)

    ట్రైలర్‏లో నెట్టింట రచ్చ..

    ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. ముఖ్యంగా ఇందులో విజయ్ నత్తిగల కుర్రాడిగా సరికొత్తగా కనిపించాడు.

  • 20 Aug 2022 06:38 PM (IST)

    లైగర్ కోసం వెయిటింగ్..

    లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి మొదలైంది. ఇప్పటికే చిత్రయూనిట్ గుంటూరులో ల్యాండ్ అయ్యింది. ఇక ఇప్పటికే విజయ్ కోసం వచ్చిన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

  • 20 Aug 2022 06:29 PM (IST)

    బాలీవుడ్‏కు విజయ్..

    డైరెక్టర్ పూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం యావత్ దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాదిలో దేవరకొండకు ఫ్యాన్ క్రేజ్ పెరిగిపోయింది.

  • 20 Aug 2022 06:12 PM (IST)

    రౌడీ భారీ కటౌట్స్‏తో హంగామా..

    లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబరాలు షూరు అయ్యాయి. ఇప్పటికే భారీ ఎత్తైన కటౌట్ ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • 20 Aug 2022 06:02 PM (IST)

    లైగర్ క్రేజ్..

    సౌత్ టూ నార్త్.. లైగర్ చిత్రంతో విజయ్‏కు మరింత పెరిగిన క్రేజ్. ముఖ్యంగా లైగర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం క్యూకట్టిన అమ్మాయిలు.

  • 20 Aug 2022 05:44 PM (IST)

    రౌడీ కోసం తరలిన అభిమానులు..

    లైగర్ ప్రీరిలీజ్ ఈవెంట్ సంబరాలు మొదలయ్యాయి. రౌడీ కోసం వేదిక వద్దకు భారీగా తరలివచ్చారు ఫ్యాన్స్.

Published On - Aug 20,2022 5:34 PM

Follow us