AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త, భార్య, ప్రియుడు.. ఓ టమాట కెచప్.. క్రైమ్ కథా చిత్రమ్.. స్టోరీ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

బెంగళూరులోని దొడ్డబిదరకల్లుకు చెందిన అనుపల్లవి అనే మహిళకు నవీన్‌కుమార్‌తో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

భర్త, భార్య, ప్రియుడు.. ఓ టమాట కెచప్.. క్రైమ్ కథా చిత్రమ్.. స్టోరీ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Aug 20, 2022 | 8:00 PM

Share

Bengaluru Crime Love Story: ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది. దీనికోసం కిరాయి హంతకులకు రెండు లక్షలకు సుఫారీ ఇచ్చింది. కానీ, కాంట్రాక్ట్ కిల్లర్లు.. ప్లాన్‌లో చిన్న మార్పు చేశారు. ఆమె భర్తతో కలిసి డ్రామాలాడారు. ప్లాన్‌ పూర్తయినట్లు ధృవీకరించడానికి ఓ ఫోటోను పంపారు. దీంతో ఈ హత్య తన మెడకు చుట్టుకుంటేందేమోనన్న భయంతో ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్‌ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. 26 ఏళ్ల మహిళ తన భర్తను చంపడానికి వేసిన ప్లాన్ బెడిసికొట్టినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని దొడ్డబిదరకల్లుకు చెందిన అనుపల్లవి అనే మహిళకు నవీన్‌కుమార్‌తో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్ మిల్లు నడుపుతూ క్యాబ్ డ్రైవర్‌గా కూడా పనిచేస్తున్నాడు. అయితే.. అనుపల్లవికి హిమవంత్ కుమార్‌తో ఎఫైర్ ఉంది. అయితే.. భర్త నవీన్‌ను హత్య చేసేందుకు ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్‌లను ఏర్పాటు చేసుకుంది. వారికి అడ్వాన్స్‌గా రూ.90 వేలు చెల్లించగా, పని పూర్తయ్యాక రూ.1.1 లక్షలు చెల్లించాల్సి ఉంది.

ఈ క్రమంలో జులై 23న ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లు.. తమిళనాడు వెళ్లేందుకు నవీన్ క్యాబ్‌ను అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి నవీన్‌ను కిడ్నాప్ చేసి ఓ ఇంట్లో ఉంచారు. అయితే, నిందితులు నవీన్‌ను చంపడానికి ధైర్యం చేయలేక, అతనితో స్నేహం చేసి అసలు విషయాన్ని చెప్పి డ్రామాలాడారు. పని అయిందో లేదో ఫోన్ చేసి కన్ఫర్మ్ చేయమని అనుపల్లవి అడగడంతో నిందితులు నవీన్ శరీరంపై టమోటా కెచప్ పోసి కథ ముగిసినట్లు చిత్రీకరించి హిమవంత్, అనుపల్లవికి పంపించారు. ఆ ఫోటో చూసి భయపడిన హిమవంత్ ఆగస్టు 1న బాగలగుంటెలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంతలో, నవీన్ సోదరి ఆగస్టు 2న పీణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. నవీన్‌ ఆగస్టు 6 న తిరిగి రాగా.. పోలీసులు అతనిని ప్రశ్నించారు. దీంతో ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలను పోలీసులకు వివరించాడు.

ఆ తర్వాత పోలీసులు హిమవంత్‌, అనుపల్లవిల ఫోన్‌లను తనిఖీ చేయగా.. అనుపల్లవి తల్లి అమ్మోజమ్మ హస్తం కూడా ఉన్నట్లు గుర్తించారు. కిడ్నాపర్లను హరీష్, నాగరాజు, ముగిలన్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేశారు. కాగా.. నవీన్ అనుపల్లవిని ప్రేమిస్తున్నాడని, ఆమెను క్షమించాలని పోలీసులను కోరినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం