AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: యువత ప్రాణాలు తీస్తున్న ‘గుండెపోటు’.. అవే ప్రధాన కారణమని హెచ్చరిస్తున్న నిపుణులు..

సాధారణంగా.. గుండెపోటును 'సైలెంట్ కిల్లర్' అంటారు. ఎందుకంటే, వ్యాధి ఎల్లప్పుడూ సంకేతాలు లేదా ఏవైనా ప్రారంభ లక్షణాలను చూపదు. దీనికి సకాలంలో గుర్తించకపోవడం, నిర్లక్ష్యం కారణంవల్ల మరణాలకు దారి తీస్తుంది.

Heart Attack: యువత ప్రాణాలు తీస్తున్న ‘గుండెపోటు’.. అవే ప్రధాన కారణమని హెచ్చరిస్తున్న నిపుణులు..
Heart Attack
Shaik Madar Saheb
|

Updated on: Aug 20, 2022 | 5:19 PM

Share

Cardiac Arrest Cases: ప్రస్తుత కాలంలో పెద్దలతోపాటు యువతలోనూ గుండెపోటు, గుండె సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అనారోగ్య జీవనశైలి, ఒత్తిడి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సినీ జర్నలిస్ట్ కౌశిక్ ఎల్ఎమ్ అకాల మరణం పట్ల సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వయసు కేవలం 35 ఏళ్లు మాత్రమే.. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నిద్ర పోయిన కౌశిక్.. మళ్లీ లేవలేదు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా.. చిన్నవయస్సులోనే ఆయన మరణించడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

సాధారణంగా.. గుండెపోటును ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. ఎందుకంటే, వ్యాధి ఎల్లప్పుడూ సంకేతాలు లేదా ఏవైనా ప్రారంభ లక్షణాలను చూపదు. దీనికి సకాలంలో గుర్తించకపోవడం, నిర్లక్ష్యం కారణంవల్ల మరణాలకు దారి తీస్తుంది. అనేకసార్లు, చాలా ఆలస్యం అయ్యే వరకు వ్యక్తులు సాధారణంగా లక్షణాల గురించి బయటపెట్టరు. గుండెపోటు కేసులు మధ్య వయస్కుల్లోనే కాకుండా సాపేక్షంగా చిన్నవారిలో కూడా పెరుగుతున్నాయి. భారతదేశంలో యువత కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం నుంచి రక్షించుకునేందుకు తీసుకుంటున్న చర్యలను మనం చూస్తున్నాం. ఊహించని గుండె పోటుకు ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, ఆధునిక జీవనంతో ముడిపడి ఉన్న ఒత్తిడి అని SRL టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ అభా సభిఖి తెలిపారు.

ఫోర్టిస్ హాస్పిటల్స్‌లోని డైరెక్టర్ & ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజ్‌పాల్ సింగ్ కూడా దీని గురించే తెలిపారు. 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువకులలో గుండెపోటు ప్రాబల్యం, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న ఇలాంటి వారితో పోలిస్తే చాలా ఎక్కువ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆకస్మిక గుండెపోటు వెనుక కారణాలు ఏమిటి..?

డాక్టర్ సింగ్ మాట్లాడుతూ..‘‘దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అసాధారణమైన లిపిడ్ ప్రొఫైల్, మధుమేహం, ధూమపానం, ఊబకాయం, బెల్లిఫ్యాట్ పెరుగుదల, హృదయ సంబంధ వ్యాధులకు కారణమవుతుంది. ఇంకా జన్యువుల ప్రభావం కూడా దీనికి సహరిస్తంది’’. అని తెలిపారు.

అతిగా వ్యాయామం చేసే ధోరణి ఉందని, అది ఒక వ్యక్తి సాధారణ ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్ సభిఖి తెలిపారు. ‘‘శారీరక వ్యాయామం పొందడం చాలా ముఖ్యం కాని అది శరీర శారీరక పరిమితుల్లో ఉండాలి’’ అని ఆమె చెప్పారు.

యువకుల్లో ప్రాణాంతక గుండెపోటుకు కారణం ఏమిటి?

మార్చి 2019లో అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ తన పరిశోధనలో ఆసక్తికర విషయాలను ప్రచురించింది.. ‘‘యుఎస్‌లో తక్కువ గుండెపోటులు సంభవిస్తున్నప్పటికీ, స్టాటిన్స్ వంటి మందుల వాడకం, ధూమపానం వల్ల ఈ సంఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. చాలా చిన్నవారిలో కూడా ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ధోరణిని ధృవీకరించడమే కాకుండా 40 ఏళ్లలోపు వారికి ఎక్కువ గుండెపోటులు వస్తున్నాయని వెల్లడించింది.

గుండె సమస్యలపై వైద్యులు అప్రమత్తంగా ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య నమూనాను నివేదిస్తున్నారు. 40 ఏళ్లలోపు వారికి గుండెపోటుల రేటు పెరుగుతోంది. ఆధునిక వైద్యం ప్రకారం.. వృద్ధాప్యం కూడా గుండెపోటుకు అతిపెద్ద ప్రమాద కారకాల్లో ఒకటిగా పరిగణిస్తోంది. సాధారణంగా వారి 50 ఏళ్లలోపు పురుషులు, 60 ఏళ్ల చివరిలో ఉన్న మహిళలను ఇది ప్రభావితం చేస్తుంది.

హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం.. గుండెపోటు, లేదా అకాల గుండె సమస్యలు అనేవి పురుషునిలో 55 ఏళ్లలోపు లేదా స్త్రీలో 65 ఏళ్లలోపు సంభవిస్తుంది. ‘‘40 ఏళ్లలోపు ఎవరైనా గుండెపోటుతో రావడాన్ని చూడటం చాలా అరుదు, వీరిలో కొందరు ఇప్పుడు వారి 20, 30 ఏళ్ళ ప్రారంభంలో ఉన్నారు’’ అని బ్రిగమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌లోని కార్డియాలజిస్ట్ రాన్ బ్లాంక్‌స్టెయిన్ అన్నారు. రాన్ బ్లాంక్‌స్టెయిన్.. బోస్టన్‌లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో అసోసియేట్ ప్రొఫెసర్. మనం చూస్తున్నదాన్ని అంశాల ప్రకారం.. తప్పు దిశలో పయనిస్తున్నట్లు అనిపిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ (USA) కూడా ఈ షాకింగ్ పరిణామాన్నే పేర్కొంది. ఇప్పుడు 20, 30, 40 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తులు ఈ కార్డియోవాస్కులర్ దాడులకు ఎక్కువగా గురవుతున్నారు. ‘‘మేము ఇప్పుడు 25 లేదా 35 సంవత్సరాల వయస్సు గల యువకులలో గుండెపోటును చూస్తున్నాము’’ అని కార్డియాలజిస్ట్ ల్యూక్ లాఫిన్ తెలిపారు. ఇరవై సంవత్సరాల క్రితం ఇలా ఉండేది కాదని.. దీని గురించి వైద్య చరిత్రలో అరుదుగా చర్చించేవారని డాక్టర్ లాఫిన్ ఉటంకించారు.

Source Link

మరిన్ని హెల్త్  న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి