AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోడీ, ఐఏఎస్‌ అధికారిపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌.. కానిస్టేబుల్‌ సస్పెండ్‌.. అసలేమైందంటే..?

కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అజయ్ గుప్తా.. ట్విట్టర్‌ ప్రధాని మోదీపై, మహిళా ఐఏఎస్‌ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సస్పెన్షన్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రధాని మోడీ, ఐఏఎస్‌ అధికారిపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌.. కానిస్టేబుల్‌ సస్పెండ్‌.. అసలేమైందంటే..?
Constable Suspended
Shaik Madar Saheb
|

Updated on: Aug 20, 2022 | 7:31 PM

Share

Kanpur Crime Branch constable suspended: అతనొక కానిస్టేబుల్.. కానీ, అదంతా మర్చిపోయాడు.. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సహా మహిళా ఐఏఎస్ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో అధికారులు అతన్ని సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. కాన్పూర్ క్రైం బ్రాంచ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అజయ్ గుప్తా.. ట్విట్టర్‌ ప్రధాని మోదీపై, మహిళా ఐఏఎస్‌ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సస్పెన్షన్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. అజయ్ గుప్తా ట్విట్టర్‌లో వివాదాస్పద ట్వీట్లు చేసి వాటికి సమాధానం కూడా ఇచ్చాడని దీనికి సంబంధించిన స్క్రీన్‌ గ్రాబ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. కాన్పూర్ హెడ్ క్వార్టర్స్ ఈ విషయాన్ని గుర్తించి వెంటనే కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసింది.

అజయ్ గుప్తా చాలా కాలంగా కాన్పూర్‌ కమిషనరేట్ క్రైమ్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 14న పోలీసు పతకాలను ప్రకటించగా పతక జాబితాకు సంబంధించి సోషల్ మీడియాలో కమిషనరేట్ అధికారులు, డీజీపీని ప్రశ్నిస్తూ ట్విట్స్‌ చేశాడు. దీనిపై కమిషనరేట్ పోలీసులు సమాధానం ఇచ్చారు. అయితే.. ఈలోగా అజయ్ పాత ట్వీట్లు కూడా వెలుగుచూశాయి. వీటిపై కానిస్టేబుల్‌ ప్రధానిపైనా, మహిళా ఐఏఎస్‌ అధికారిపైనా అవమానకర వ్యాఖ్యలు చేస్తూ ట్విట్స్‌ చేశాడు. తన ట్వీట్స్ వైరల్ అయిన విషయం తెలియడంతో అజయ్.. వాటిని డిలీట్ చేశాడు. కానీ, అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. వివాదాస్పద ట్వీట్ స్క్రీన్‌షాట్స్, యూఆర్‌ఎల్‌లను అధికారులు సేవ్ చేయడంతో అడిషనల్ సీపీ ఆనంద్ కులకర్ణి అతడిని సస్పెండ్ చేయడంతోపాటు విచారణకు ఆదేశించారు.

ఈ విషయంపై పోలీస్ కమీషనర్ జోగ్‌దండ్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ సోషల్ మీడియాలో హద్దులు దాటి కొన్ని పోస్ట్‌లు పెట్టాడని.. ఇది మా ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించడమేనని తెలిపారు. పోలీసు ఉద్యోగం కావున కొన్ని హద్దులుంటాయని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం