Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఫుల్లుగా తాగండి.. దేశాన్ని ఆదుకోండి..! అక్కడి సర్కార్ ట్యాగ్ లైన్ ఇదే..

Drink More-Boost Economy: ఈరోజు మద్యం తాగడం అనేది కామన్. ఆడమగా తేడా లేకుండా అందరూ మద్యం తాగేస్తున్నారు. కానీ ఇదంతా ఆ దేశంలో మాత్రం కాదు..

Viral News: ఫుల్లుగా తాగండి.. దేశాన్ని ఆదుకోండి..! అక్కడి సర్కార్ ట్యాగ్ లైన్ ఇదే..
Drinking Alcohol
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 19, 2022 | 3:39 PM

పొగ తాగని వాడు దున్నపోతై పుట్టును అని నాటి గిరీషం పంతులు చెప్పిన సంగతి తెలిసిందే.. అదే మందు తాగనివాడు అసలు మనిషే కాదంటాడు నేటి ఆధునిక జపానీ గిరీషం.. ఈరోజు మద్యం తాగడం అనేది కామన్. ఆడమగా తేడా లేకుండా అందరూ మద్యం తాగేస్తున్నారు. కానీ ఇదంతా ఆ దేశంలో మాత్రం కాదు. ఎందుకంటే అక్కడి యువకులు మద్యం ముట్టుకోవడం మానేస్తున్నారట. అక్కడి యువతలో మద్యపానం మానేయాలనే స్పృహ నిరంతరం పెరగడంతోపాటు.. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెరిగిందంటున్నారు అక్కడి ప్రభుత్వ అధికారులు. చాలా మంది మద్యపానానికి స్వస్తి పలుకుతున్నారు. ఇలా రోజురోజుకు మద్యపాన ప్రియుల సంఖ్య పడిపోతోందట. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వ పెద్ద ఓ కీలక ప్రకటన చేశారు. యువత ఎక్కువగా మద్యం సేవించాలని విజ్ఞప్తి చేశారు. జపాన్ ప్రభుత్వం అలాంటి విజ్ఞప్తిని ఎందుకు చేస్తోందో తెలుసుకుందాం?

జపాన్‌లో ప్రస్తుత తరం వారి తల్లిదండ్రులు, పెద్దలు లేదా  గతంలో వారి పూర్వీకుల కంటే తక్కువ మద్యం సేవిస్తున్నారు. దీంతో మద్యంపై వచ్చే పన్ను బారీగా తగ్గింది. ఆదాయంలో ఒక్కసారిగా పడిపోవడంతో వెంటనే అలర్ట్ అయ్యింది జపాన్ ప్రభుత్వం. తన పౌరులను మద్యం సేవించేలా వ్యాపారస్థులు ఆలోచనలు చేయాలని కోరింది జపాన్ ప్రభుత్వం. ఇందు కోసం జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఈ పోటీలో గెలిచినవారికి అవార్డులు అందించాలని నిర్ణయించింది. యువత ఎక్కువగా మద్యం సేవించడం జపాన్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపడుతుందని అనుకుంటోంది. ఈ పోటీలో పాల్గొనేవారు అధిక ఆల్కహాల్ వినియోగం, ఆకర్షణీయమైన బ్రాండింగ్, పరిశ్రమల ప్రమోషన్ చేసేలా వుండాలని కోరింది.

దీనిని పోటీలో చేర్చవచ్చు

ఇవి కూడా చదవండి

ఈ జాతీయ స్థాయి పోటీల్లో 20 నుంచి 39 ఏళ్లలోపు యువత పాల్గొనవచ్చు. ఈ ఆలోచన ప్రకారం, యువత తమ తరంలో మద్యం ఎలా తాగవచ్చో చెప్పాలి. అమ్మకాలు ఎలా పెంచవచ్చో ఇందులో వారు సలహా ఇవ్వాల్సి ఉంటుంది. వీరు ఇచ్చే ఆకర్శనీయమైన ఆలోచనను జపాన్ ప్రభుత్వ స్వీకరిస్తుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి ప్రాధాన్యం ఉంటుందని ప్రత్యేకంగా సూచించింది ప్రభుత్వం.

25 శాతం తగ్గిన అమ్మకాలు..

యువత ఎక్కువగా మద్యం సేవించేలా ప్రోత్సహించేందుకు ప్రచారం నిర్వహిస్తోంది జపాన్ ప్రభుత్వం. ఇందు కోసం ఒక వెబ్‌సైట్ కూడా ప్రారంభించింది. పన్ను ఏజెన్సీ నుండి ఇటీవలి గణాంకాలు 1995 కంటే 2020లో తక్కువ మద్యం సేవిస్తున్నారని చూపిస్తున్నాయి. ఇందులో ఆల్కహాల్ వినియోగం నాలుగో వంతు తగ్గిందని అంచనా. జపాన్ టైమ్స్ వార్తాపత్రిక ప్రకారం, 1980లో మద్యం పన్ను మొత్తం ఆదాయంలో 5 శాతం వసూలు చేసింది. 2020లో ఈ సంఖ్య 1.7 శాతం మాత్రమే.

 దెబ్బ తింటున్న ఉపాధి..

ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, జపాన్‌లోని జనాభాలో మూడింట ఒక వంతు (29%) మంది 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వారు ఉన్నారని తేల్చింది. జపాన్ ఆందోళన ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు. మద్యం తాగేవారి సంఖ్య తగ్గిపోవడంతో దీనిపైనే ఆధారపడినవారికి ఉపాధి కోల్పోతున్నారని తేల్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం