Monkeypox: ఆందోళన కలిగిస్తున్న మంకీపాక్స్.. ఈ కేసును చూసి ఆశ్యర్యపోయిన శాస్త్రవేత్తలు.. అదేంటంటే..!
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 90 దేశాలకుపైగా 35 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి..
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 90 దేశాలకుపైగా 35 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి ఒకరికొకరు దగ్గరి సంబంధం ద్వారా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు కూడా ఇదే తేల్చారు. ఈ మధ్య కాలంలో మనుషుల నుంచి కుక్కకి ఈ వైరస్ సోకిందనే విషయం తెరమీదికి రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మనుషుల నుంచి జంతువులకు సోకిన కేసులు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో గుర్తించారు. ఈ విధంగా వైరస్ వ్యాప్తి చెందడం ఇప్పటివరకు ఇదే మొదటి కేసు. దీనిపై శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 60 ఏళ్లకు పైగా మంకీపాక్స్ చరిత్రలో ఇలాంటి కేసు రాలేదు. ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఈ నివేదిక ప్రచురితమైంది. ఈ కేసు తర్వాత జంతువుల పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ మంకీపాక్స్ వైరస్ కుక్కకు సోకవడంతో దాని శరీరంపై దద్దుర్లు, పుండ్లు కనిపించాయి. దీంతో కుక్కను పరిశీలించిన శాస్త్రవేత్తలు అది మంకీపాక్స్ వైరస్ అని గుర్తించారు. 12 రోజుల ముందు పెంపుడు జంతువు యజమానికి కూడా మంకీపాక్స్ సంకేతాలు కనిపించాయి. అతనికి జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు వచ్చాయి. ఇప్పుడు జంతువులకు ఈ వైరస్ సోకుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ సోకిన కుక్క నుండి ఇతర జంతువులకు కూడా వ్యాప్తి చెందుతుందని ఆందోళనకు గురవుతున్నారు. ఈ వైరస్‌పై మరింత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రకమైన కేసు ఆందోళన కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో జంతువులను కూడా వైరస్ నుండి రక్షించవలసి ఉంటుంది.
ఇదిలా ఉండగా, మంకీపాక్స్ వ్యాక్సిన్‌కు సంబంధించి WHO ఒక ప్రకటన విడుదల చేసింది. మంకీపాక్స్ వ్యాక్సిన్ 100% ప్రభావవంతంగా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఈ వైరస్ నుండి రక్షించాల్సిన అవసరం ఉంది. మంకీపాక్స్ వ్యాధి లక్షణాలపై అవగాహన అవసరం. ఇప్పటివరకు మంకీపాక్స్ చాలా కేసులు యూరప్, అమెరికాలో నమోదయ్యాయి. ఈ వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది స్వలింగ సంపర్కులే. మే నెల నుంచి మంకీపాక్స్ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి