Maruti Alto K10: మారుతి సుజుకి నుంచి సరికొత్త కారు.. ఆల్టో కె10.. ధర కేవలం రూ.3.39 లక్షలు.. మైలేజీ ఎంతంటే..!

Maruti Alto K10: దేశంలో అగ్రగామిగా ఉన్న కార్ల సంస్థ మారుతి సుజుకి ఇండియా సరికొత్త కార్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. సామాన్యుడికి సైతం తక్కువ ధరల్లో..

Maruti Alto K10: మారుతి సుజుకి నుంచి సరికొత్త కారు.. ఆల్టో కె10.. ధర కేవలం రూ.3.39 లక్షలు.. మైలేజీ ఎంతంటే..!
Alto K10
Follow us

|

Updated on: Aug 23, 2022 | 3:36 PM

Maruti Alto K10: దేశంలో అగ్రగామిగా ఉన్న కార్ల సంస్థ మారుతి సుజుకి ఇండియా సరికొత్త కార్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. సామాన్యుడికి సైతం తక్కువ ధరల్లో అందుబాటులో తీసుకువచ్చే సుజుకి.. తాజాగా మరో కారును ఇటీవల విడుదల చేసింది. అదే 2022 ఆల్టో కె10. దీని ధర కేవలం రూ.3.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ Alto K10 కారు మొత్తం ఆరు వేరియంట్లలో విడుదల చేసింది కంపెనీ. వీటిలో నాలుగు మ్యాన్యువల్‌ కాగా, మరో రెండు ఆటోమేటిక్‌ వేరియంట్లు ఉన్నాయి.

ఆల్టో కె 10 వేరియంట్ల ధరలు..

  1. Alto K10 Std: ఆల్టో కె10 స్టాండర్డ్‌ వేరియంట్‌ ధర రూ. రూ.3.99 లక్షలు
  2. Alto K10 LXi: ఆల్టో కె10 ఎల్‌ఎక్స్‌ఐ ధర రూ.రూ.4.82 లక్షలు
  3. Alto K10 VXi: ఆల్టో విఎక్స్‌ఐ ధర రూ. రూ.5 లక్షలు
  4. Alto K10 VXi Plus: ఆల్టో కె10 విఎక్స్‌ఐ ప్లస్‌ ధర రూ.5.33
  5. Alto K10 VXi AT: ఆల్టోకె10 విఎక్స్ఐ ఏటీ ధర రూ.రూ.5.50 లక్షలు
  6. Alto K10 VXi Plus AGS: ఆల్టో కె10 విఎక్స్ఐ ప్లస్ ఏజిఎస్ ధర రూ.5.83 లక్షలు(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఆల్టో కె10కు సరికొత్త డిజైన్‌

ఇవి కూడా చదవండి

కాగా, ప్రస్తుతం ఆల్టో 800 నుంచి ప్రత్యేకంగా కనిపించేలా కంపెనీ ఈ కొత్త ఆల్టో కె10 డిజైన్‌ను రూపొందించింది. ఇందులో కొత్త స్వెప్ట్‌బ్యాక్‌ హాలోజన్‌ హెడ్‌ల్యాప్‌లు, సుజుకీ బ్యాడ్జ్‌పైన ఉన్న పెద్ద సింగిల్‌-పీస్‌గ్రీన్‌ వంటివి ఉన్నాయి. దీనికి ముందు భాగంలో బంపర్‌ కూడా సరికొత్తగా తయారు చేసింది కంపెనీ. ఆల్టో కె10 లోపలి భాగం చాలా వరకు నలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉంటుంది.

ఈ ఆల్టో కె10కు 998సీసీ, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 66 బిహెచ్‌పి శక్తిని, 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్‌ మ్యాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ లేదా 5 స్పీడ్‌ ఆటోమేటెడ్‌ మ్యాన్యువల్‌ ట్రాన్సిమిషన్‌ ఆప్షన్స్‌తో లభిస్తుంది. మైలేజీ విషయానికొస్తే లీటర్‌కు 24.9 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి