Aadhaar Card Update: ఆధార్ కార్డ్ హోల్డర్లకు గుడ్‌న్యూస్‌.. యూఐడీఏఐ మరో ముందడుగు.. అదేంటో తెలుసా..?

Aadhaar Card Update: భారతదేశంలో దాదాపు ప్రతి ముఖ్యమైన పనికి ఆధార్ కార్డ్ తప్పనిసరి అవసరం. ఇది లేనిది ప్రభుత్వ, ప్రైవేటు ఇతర చిన్నపాటి పనులు కూడా జరగని పరిస్థితి..

Aadhaar Card Update: ఆధార్ కార్డ్ హోల్డర్లకు గుడ్‌న్యూస్‌.. యూఐడీఏఐ మరో ముందడుగు.. అదేంటో తెలుసా..?
Aadhaar Card Update
Follow us
Subhash Goud

|

Updated on: Aug 23, 2022 | 2:48 PM

Aadhaar Card Update: భారతదేశంలో దాదాపు ప్రతి ముఖ్యమైన పనికి ఆధార్ కార్డ్ తప్పనిసరి అవసరం. ఇది లేనిది ప్రభుత్వ, ప్రైవేటు ఇతర చిన్నపాటి పనులు కూడా జరగని పరిస్థితి ఉంది. అందుకే ప్రతి ఒక్కరికి ఆధార్‌ ఎంతో ముఖ్యం. ఆధార్‌ అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి ప్రయాణం వరకు, ఐటీఆర్ దాఖలు చేయడం నుంచి స్కూల్ కాలేజీలో అడ్మిషన్ వరకు అన్నిచోట్లా ఆధార్ తప్పనిసరి. కొన్నిసార్లు ఆధార్ కార్డ్‌లోని కొంత సమాచారం తప్పుగా అప్‌డేట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాంటప్పుడు ఆధార్‌ను అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేశంలోని ప్రతి ప్రాంతంలో ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

114 కొత్త ఆధార్ సేవా కేంద్రాలు

ఇటీవల UIDAI దేశవ్యాప్తంగా 114 కొత్త ఆధార్ సేవా కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. దీని వల్ల ప్రజలు కొత్త ఆధార్‌లను తయారు చేయడం, పాత వాటిని అప్‌డేట్ చేయడం సులభం అవుతుంది. ఈ 114 ఆధార్ కేంద్రాలలో 53 కేంద్రాలు దేశంలోని పెద్ద నగరాలు ఉన్నాయి. ఇది కాకుండా అన్ని రాష్ట్రాలు, చిన్న నగరాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మిగిలిన ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఆధార్ సేవా కేంద్రం ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.30 వరకు తెరిచి ఉంటుంది. ఆధార్ సేవా కేంద్రంతో పాటు దేశవ్యాప్తంగా అనేక ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. ఆధార్ సెంటర్‌లో బ్యాంక్, పోస్టాఫీస్, BSNL ఆఫీస్ వంటి కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పనులుకూడా జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం గురించి సమాచారాన్ని పొందడానికి UIDAI టోల్ ఫ్రీ 1947 నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా మీరు ఆధార్ సమాచారాన్ని పొందవచ్చు. ఇది కాకుండా మీరు mAadhaar యాప్ ద్వారా సేవా కేంద్రాన్ని కూడా గుర్తించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి