AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal: విశాల్ కు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. ఇలా చేసిందేంటి..!!

యాక్షన్ విశాల్‌కు మద్రాస్ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది.తన ఆస్తుల వివరాలతో సెప్టెంబర్‌ 9న హాజరవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..

Vishal: విశాల్ కు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. ఇలా చేసిందేంటి..!!
Vishal
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2022 | 9:47 PM

Share

యాక్షన్ విశాల్‌(Vishal)కు మద్రాస్ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది.తన ఆస్తుల వివరాలతో సెప్టెంబర్‌ 9న హాజరవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..ఎందుకంటే విశాల్ లైకా ప్రొడక్షన్స్ నుంచి ‘వీరమే వాగై సుడుం’ మూవీ కోసం అప్పుగా 21.29 కోట్లు తీసుకున్నారు. అయితే లైకా సంస్థకు అప్పు తీర్చకుండానే విశాల్ ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్మడానికి రెడీ అయ్యారని లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది..దీంతో ఈ పిటిషన్‌పై విచారించిన మద్రాస్‌ హైకోర్టు మార్చ్‌లో లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి 15 కోట్లు డిపాజిట్‌ చేయాలని తెలిపింది.అయితే ఇప్పటివరకు మాకు ఒక రూపాయి కూడా చెల్లించలేదని మరోసారి కోర్టును ఆశ్రయించింది లైకా ప్రొడక్షన్స్‌..దీంతో మరోసారి ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు విశాల్‌ను ఎందుకట్టలేదని ప్రశ్నించింది..తనకు ఒక్క రోజులోనే 18 కోట్ల నష్టం వచ్చిందని, ఆ మొత్తానికి వడ్డీ చెల్లిస్తున్నానని విశాల్ కోర్టుకు తెలిపారు..ఆరు నెలల తర్వాత కూడా తాను ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయలేనన్నారు విశాల్‌.. అయితే విశాల్‌ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారని, ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయగలరని లైకా తరపు న్యాయవాది వాదనను తిరస్కరించారు.కానీ నేను బకాయిలు తిరిగి చెల్లించడం కోసమే తాను ఖచ్చితంగా సినిమాల్లో యాక్ట్‌ చేస్తున్నా అని విశాల్‌ అనగా, మరి సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోవడంలేదా అంటూ లైక్ తరపు న్యాయవాది కౌంటర్‌ దాఖలు చేశారు.. దీంతో సెప్టెంబర్ 9న తన ఆస్తుల వివరాల సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని విశాల్‌ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!