AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda: టాలీవుడ్, బాలీవుడ్‌ కాదు.. ఇండియానే నా టార్గెట్‌.. టీవీ9 ప్రత్యేక ఇంటర్వ్యూలో విజయ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Vijay Devarakonda: పెళ్లి చూపులతో హీరోగా మారిన విజయ్‌ మొదటి సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. రెండో సినిమా 'అల్లు అర్జున్'తో ఇండస్ట్రీని ఒక్కసారి షేక్‌ చేశాడు. ఎంతలా అంటే విజయ్‌ పేరు బాలీవుడ్‌ వరకు వినిపించేంతేలా...

Vijay Devarakonda: టాలీవుడ్, బాలీవుడ్‌ కాదు.. ఇండియానే నా టార్గెట్‌.. టీవీ9 ప్రత్యేక ఇంటర్వ్యూలో విజయ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Liger Vijay Deverakonda Exclusive Interview On News9 Plus
Narender Vaitla
|

Updated on: Aug 26, 2022 | 2:54 PM

Share

Vijay Devarakonda: పెళ్లి చూపులతో హీరోగా మారిన విజయ్‌ మొదటి సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. రెండో సినిమా ‘అల్లు అర్జున్’తో ఇండస్ట్రీని ఒక్కసారి షేక్‌ చేశాడు. ఎంతలా అంటే విజయ్‌ పేరు బాలీవుడ్‌ వరకు వినిపించేంతేలా. తనదైన నటన, గ్రౌండ్‌ టూ ఎర్త్‌ బిహేవియర్‌తో విజయ్‌ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అనతి కాలంలోనే అగ్ర హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. తాజాగా ‘లైగర్‌’ చిత్రంతో తొలిసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్‌. ఈ సినిమాలో ఫైటర్‌గా కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాడు. సినిమా చూసినవారంతా వన్‌ మ్యాన్‌ షో అంటూ విజయ్‌పై పొగడ్తలు కురిపిస్తున్నారు. పూరీ జగన్నాథ్‌ మార్క్‌ డైలాగ్‌లు, విజయ్‌ నటన ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీవీ9 MD, CEO బరున్‌ దాస్‌తో విజయ్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ ( ఇచ్చాడు. ఇందులో భాగంగా విజయ్‌ తన కెరీర్‌, బాలీవుడ్‌ ఎంట్రీ, లైగర్‌ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన ఫోకస్‌ ప్రత్యేకంగా బాలీవుడ్‌పై లేదని తెలిపిన విజయ్‌.. ప్రేక్షకులకు కథ చెప్పడమే తొలి ప్రాధాన్యత అని వివరించాడు. ఇండస్ట్రీ కంటే తనకు ఇండియా ముఖ్యమన్న విజయ్‌.. మనం చెప్పే కథను దేశం మొత్తానికి చెప్పాలని విజయ్‌ చెప్పుకొచ్చారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ జాతీయ స్థాయిలో సాధిస్తున్న విజయాలపై కూడా రౌడీ హీరో స్పందించారు. తెలుగు సినిమా విజయాలను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. బాహుబలి చిత్రం వేసిన బాటలోనే లైగర్‌ కూడా నడుస్తోంది అని చెప్పుకొచ్చాడు.

ఇక లైగర్‌ చిత్రంలో షర్ట్ లెస్‌ సీన్స్‌లో కనిపించిన విజయ్‌ దీనికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. తొలుత మేకర్స్‌ని ఇలాంటి సన్నివేశాలను చిత్రీకరించకూడదని తెలిపానని, కానీ సినిమాలో హీరో పాత్ర ఒక ఫైటర్‌, అతను అలా కనిపించి తీరాలని నమ్మిన తర్వాత ఓకే చెప్పానని వివరించాడు. ఇక కరణ్‌ జోహార్‌ లైగర్‌ నిర్మాణంలో భాగస్వామ్యంకావడంపై స్పందించిన విజయ్‌.. ‘కరణ్‌ జోహార్‌ నేను నటించిన అర్జున్‌ రెడ్డిని చూసి నాపై ప్రశంసలు కురిపించారు. అనంతరం ఎప్పుడు హిందీ సినిమా చేయాలని ఉన్నా తనను సంప్రదించాలని కోరారు. లైగర్‌ సినిమా కథ చెప్పిన వెంటనే చిత్రాన్ని దేశ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా ఈ సినిమా ఇంత పెద్దదిగా మారింది’ అని విజయ్‌ తెలిపారు.

వీటితో పాటు బరున్‌ దాస్‌ సంధించిన మరెన్నో ఆసక్తికర ప్రశ్నలకు బదులిచ్చాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి వీడియో 4 ఎపిసోడ్స్ న్యూస్ 9 ప్లస్ యాప్ (News 9plus)లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సిరీస్ చూడాలంటే News 9plus యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వెబ్‌సైట్‌లో చూడాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..