Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian 2 vs RC15: ఇటు కమల్ ఇండియన్ 2.. అటు రాంచరణ్ RC15.. డైరెక్టర్ శంకర్ ఫస్ట్ ఫోకస్ ఏది..?

Indian 2 vs RC15: కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే.. ఇండియన్ 2 సినిమా మళ్లీ మొదలైంది. రెండేళ్లుగా ఏవేవో కారణాలతో వాయిదాపడుతూ వచ్చిన దీన్ని మరోసారి పూజా కార్యక్రమాలతోనే శంకర్ షురూ చేసారు.

Indian 2 vs RC15: ఇటు కమల్ ఇండియన్ 2.. అటు రాంచరణ్ RC15.. డైరెక్టర్ శంకర్ ఫస్ట్ ఫోకస్ ఏది..?
Ram Charan, Shankar
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 26, 2022 | 1:40 PM

కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే.. ఇండియన్ 2 (Indian 2 Movie) సినిమా మళ్లీ మొదలైంది. రెండేళ్లుగా ఏవేవో కారణాలతో వాయిదాపడుతూ వచ్చిన దీన్ని మరోసారి పూజా కార్యక్రమాలతోనే శంకర్ (Director S Shankar) షురూ చేసారు. మరి ఈ సినిమా షెడ్యూల్ ఎన్ని రోజులు జరగనుంది..? సెప్టెంబర్ 1 నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ మొదలవుతున్న వేళ.. రామ్ చరణ్ సినిమా(Ram Charan’s RC15 Movie)తో శంకర్ ఎప్పుడు బిజీ కానున్నారు..? ఇండియన్ 2తో పాటు చరణ్ సినిమాను ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు..? దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

చెప్పినట్లుగానే ఇండియన్ 2ను దర్శకుడు శంకర్ మొదలుపెట్టారు. సెప్టెంబర్ నుంచి అనుకున్న షూటింగ్.. ముందుగానే మొదలైంది. చెన్నైలో మరోసారి పూజా కార్యక్రమాలతో ఇండియన్ 2ను మొదలు పెట్టారు. లైకా ప్రొడక్షన్స్‌తో పాటు ఈ సారి నిర్మాతగా ఉదయనిధి స్టాలిన్ కూడా చేరిపోయారు. తమిళనాట విక్రమ్ సినిమాను విడుదల చేసింది ఈయనే. తాజాగా మరోసారి కమల్ హాసన్ సినిమాలో ఉదయనిధి భాగమయ్యారు.

Indian 2

Indian 2

లైకా ప్రొడక్షన్స్, శంకర్ మధ్య తలెత్తిన కొన్ని విభేదాల కారణంగా ఈ సినిమా షూటింగ్ అప్పట్లో ఆగిపోయింది. అదే సమయంలో షూటింగ్‌లో ప్రమాదం జరిగి.. ఇద్దరు చనిపోవడం కూడా ఇండియన్ 2పై ప్రభావం చూపించింది. మధ్యలో కోవిడ్ రావడంతో సినిమా గురించి అంతా మరిచిపోయారు. కానీ కమల్ మూవీ విక్రమ్ ఎప్పుడైతే బ్లాక్‌బస్టర్ అయిందో.. మళ్లీ ఇండియన్ 2పై ఆసక్తి పెరిగింది. శంకర్ కూడా చరణ్ సినిమాను పక్కనబెట్టి మరీ ఇండియన్ 2 వైపు వెళ్లారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే సగానికి పూర్తైన రామ్ చరణ్, శంకర్ సినిమా షూటింగ్ నిర్మాతల బ్రేక్ కారణంగా కొన్ని రోజులుగా జరగట్లేదు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి చరణ్ సినిమా షూటింగ్ యధావిథిగా సాగనున్నట్లు తెలుస్తుంది. ఈలోపు ఆగస్ట్ 24 నుంచి 31 వరకు ఇండియన్ 2 చిన్న షెడ్యూల్ ప్లాన్ చేసారు శంకర్. చరణ్ సినిమా పూర్తయ్యాకే ఇండియన్ 2పై శంకర్ ఫోకస్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే శంకర్ మాత్రం ఇటు ఇండియన్ 2, అటు రాంచరణ్ మూవీలను ఏకకాలంలో కంప్లీట్ చేస్తానని చెబుతున్నారు. అయితే ఈ రెండు మూవీల్లో ఏది ఫస్ట్ ప్రేక్షకుల ముందుకు రానుందన్న అంశం సగటు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతోంది.

మరిన్ని సినిమా వార్తలు చదవండి