Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna- Mahesh: మన్మథుడు, మహేశ్‌ల కాంబోలో భారీ మల్టీస్టారర్‌ మూవీ! సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ

వెంకటేశ్‌తో కలిసి మహేశ్‌ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సందడి చేశారు. అదేవిధంగా న్యాచురల్‌ స్టార్‌ నానితో కలిసి దేవదాసు మూవీలో నటించారు నాగ్‌. అలాంటిది వీరిద్దరూ కలిసి ఒకే ఫ్రేములో కనిపిస్తే అభిమానులకు కనుల విందే అని చెప్పువచ్చు.

Nagarjuna- Mahesh: మన్మథుడు, మహేశ్‌ల కాంబోలో భారీ మల్టీస్టారర్‌ మూవీ! సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ
Nagarjuna Mahesh
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Aug 26, 2022 | 6:42 AM

టాలీవుడ్‌ మన్మథుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) కలిసి నటించనున్నారా? వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌ మూవీ తెరకెక్కనుందా? గురువారం సోషల్‌ మీడియాలో ఈ విషయంపైనే చర్చ జరిగింది. వివరాల్లోకి వెళితే నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్‌ (The Ghost). తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని ట్విట్టర్‌ వేదికగా విడుదల చేశారు మహేశ్‌. సినిమా పెద్ద హిట్‌ కావాలంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా సూపర్‌స్టార్‌కు ధన్యవాదాలు తెలిపారు నాగ్‌. దీంతో పాటు ఓ ఆసక్తికర కామెంట్‌ పెట్టారు. ‘హే.. మహేశ్‌.. 29 ఏళ్ల క్రితం వారసుడు సినిమాలో నాతో కలిసి మీ నాన్న సూపర్‌స్టార్‌ కృష్ణగారు కలిసి నటించినప్పుడు ఎంతో సంతోషించాను. మనం కలిసి ఎందుకు సినిమా చేయకూడదు’ అంటూ మహేశ్‌ని అడిగారు. నాగ్‌ ట్వీట్‌పై మహేశ్‌ కూడా స్పందించారు. అది ఆసక్తిగా ఎదురుచూడాల్సిన విషయమంటూ మల్టీస్టారర్‌లో నటించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

ఇలా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వీరిద్దరు ఏదో ప్లాన్‌ చేస్తున్నారు’, ‘మీ కాంబినేషన్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా నాగ్‌, మహేశ్‌లు ఇద్దరు ఇప్పటికే మల్టీస్టారర్‌ సినిమాల్లో నటించారు. వెంకటేశ్‌తో కలిసి మహేశ్‌ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సందడి చేశారు. అదేవిధంగా న్యాచురల్‌ స్టార్‌ నానితో కలిసి దేవదాసులో నటించారు నాగ్‌. అలాంటిది వీరిద్దరూ కలిసి ఒకే ఫ్రేములో కనిపిస్తే అభిమానులకు కనుల విందే అని చెప్పువచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రేమ కోసం పిడకల యుద్ధం..! ఎన్నో ఏళ్ల వింత ఆచారం.. ఎక్కడంటే..
ప్రేమ కోసం పిడకల యుద్ధం..! ఎన్నో ఏళ్ల వింత ఆచారం.. ఎక్కడంటే..
ధనుష్ పై సంచలన ఆరోపణలు చేసిన నిర్మాణ సంస్థ..
ధనుష్ పై సంచలన ఆరోపణలు చేసిన నిర్మాణ సంస్థ..
తొలి విజయంతో ముంబైకి షాకింగ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ ఔట్?
తొలి విజయంతో ముంబైకి షాకింగ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ ఔట్?
3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..