Kalapuram Movie Review: ఫక్తు కరుణకుమార్‌ మార్కు సినిమా ‘కళాపురం’

కళాపురానికి చెందిన ఓ అమ్మాయి ఇచ్చిన ప్రోత్సాహంతో, అందుబాటులో ఉన్న వనరులతో అతను నాగేశ్వరి అనే సినిమా చేయడం, అనూహ్యంగా అది జనాలకు నచ్చడం, ఆఖరికి అదంతా ఓ పొలిటికల్‌ స్కెచ్‌ అని తెలియడం... కళాపురం కథ పూర్తిగా ఇది!

Kalapuram Movie Review: ఫక్తు కరుణకుమార్‌ మార్కు సినిమా 'కళాపురం'
Kalapuram Movie Review
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 26, 2022 | 3:51 PM

పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ వంటి రా అండ్ ర‌స్టిక్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌ట‌మే కాదు.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న క‌రుణ కుమార్ ఈసారి అందుకు భిన్నంగా కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో తెర‌కెక్కించిన చిత్ర‌ం కళాపురం. ఈ ఊరిలో అందరూ కళాకారులే సినిమా క్యాప్షన్. ఈసారి కళాపురంతో కరుణకుమార్‌ ఏం చెప్పదలచుకున్నారు? చూసేద్దాం.

సినిమా: కళాపురం

సమర్పణ: జీ స్టూడియోస్‌

ఇవి కూడా చదవండి

నిర్మాణ సంస్థ: ఆర్ 4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

నిర్మాత: ర‌జనీ తాళ్లూరి

నటీనటులు: స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను, కుమార్, ప్రవీణ్, సన, జబర్దస్త్ అప్పారావు త‌దిత‌రులు

సంగీతం: మణిశర్మ

దర్శకత్వం: కరుణకుమార్‌

నమ్మిన కథను చేతబట్టుకుని రోజుకో నిర్మాత చుట్టూ తిరిగే అస్టిస్టెంట్‌ డైరక్టర్‌. హీరోయిన్‌ కావాలని కలలు కంటూ అక్కడే ఉండే ఒకమ్మాయి. వారిద్దరి మధ్య ప్రేమ. అవకాశాల కోసం ఆమె కేరక్టర్‌లో మార్పులు. అది గమనించి అతను ఆమెను ప్రశ్నించడం, బాధపడటం. వారిద్దరూ విడిపోవడం. సరిగ్గా అదే సమయానికి అతనికి ఓ డైరక్షన్‌ ఛాన్స్ రావడం. కళాపురానికి బస్‌ ఎక్కడం. కళాపురంలో అడుగుపెట్టగానే ఎలక్షన్‌ కోడ్‌ పేరుతో అతని దగ్గరున్న డబ్బును పోలీసులు సీజ్‌ చేయడం. అక్కడి నుంచి ఓ చిన్న జర్నీ… కళాపురానికి చెందిన ఓ అమ్మాయి ఇచ్చిన ప్రోత్సాహంతో, అందుబాటులో ఉన్న వనరులతో అతను నాగేశ్వరి అనే సినిమా చేయడం, అనూహ్యంగా అది జనాలకు నచ్చడం, ఆఖరికి అదంతా ఓ పొలిటికల్‌ స్కెచ్‌ అని తెలియడం… కళాపురం కథ పూర్తిగా ఇది!

సినిమా టైటిల్‌ నుంచే ఆసక్తి రేకెత్తించిన సినిమా ఇది. ఫస్ట్ లుక్‌, పోస్టర్‌, టీజర్‌, సాంగ్స్, ట్రైలర్‌ అన్నీ జనాల్లోకి వెళ్లాయి. దానికి తోడు పవన్‌ కల్యాణ్‌ ట్రైలర్‌ని విడుదల చేయడం, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఓ బ్రాండ్‌ ఉన్న కరుణకుమార్‌ డైరక్ట్ చేయడంతో సినిమా మీద అంచనాలు కాస్త కనిపించాయి.

సత్యం రాజేష్‌ రీ ఎంట్రీ సినిమాగా టైటిల్‌ కార్డులో పరిచయం చేశారు. డైరక్షన్‌ ట్రయల్స్‌లో ఉన్న కేరక్టర్‌కి పర్ఫెక్ట్ గా సూటయ్యారు సత్యం రాజేష్‌. అతని పక్కన ఫ్రెండ్‌గా, హీరోగా ట్రై చేసే కేరక్టర్‌లో ప్రవీణ్ బాగా నటించారు. మిగిలిన నటీనటులు పెద్దగా పరిచయం లేకపోయినా సినిమాలో ఆయా కేరక్టర్లకు సరిపోయారు. పోలీస్ పాత్రలో కుమార్ మెప్పించారు.

అక్కడక్కడా సిట్చువేషనల్‌ కామెడీతో, డైలాగులతో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు డైరక్టర్‌. లొకేషన్లు నేచురల్‌గా ఉన్నాయి. ఎటొచ్చీ సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుందో జనాల అంచనాలకు అందడంతో పెద్ద ఇంట్రస్ట్ క్రియేట్‌ చేయలేకపోయింది.

సినిమా స్టార్టింగ్‌లో చెప్పే దెయ్యాల కథ, ఆ వెంటనే కనిపించే విలన్‌ ఎంట్రీ సీన్లను తర్వాత సస్టెయిన్‌ చేయలేకపోయారు. జబర్దస్త్ అప్పారావు బాబా కేరక్టర్‌ ఎందుకో అర్థం కాదు. ప్రొడ్యూసర్‌ అప్పారావు కేరక్టర్‌కి మంచి నటుడు దొరికారు. సరదాగా చూడాలనుకుంటే చూడొచ్చు. చూడకపోతే ఏదో మిస్‌ అయిపోతామన్న ఫీలింగ్‌ కలిగించని సినిమా కళాపురం.

– డా. చల్లా భాగ్యలక్ష్మి