Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బుమ్రాను సేమ్ టు సేమ్ దించేసిన టీమిండియా ఆల్ రౌండర్.. నెట్టింట వైరల్ వీడియో.. ఎవరంటే?

Asia Cup 2022: ఆసియా కప్‌లో అత్యంత విజయవంతమైన భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో భాగం కాలేదు. గాయంతో ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అయితే, ఈ స్టార్ బౌలర్ లేని లోటును నేను తీర్చేస్తానంటూ టీమిండియా ఆల్ రౌండర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.

Watch Video: బుమ్రాను సేమ్ టు సేమ్ దించేసిన టీమిండియా ఆల్ రౌండర్.. నెట్టింట వైరల్ వీడియో.. ఎవరంటే?
Hardik Pandya Imitates Jasprit Bumrah’s Bowling Action
Follow us
Venkata Chari

|

Updated on: Aug 24, 2022 | 11:05 AM

Asia Cup 2022, IND vs PAK: ఆసియా కప్‌ 2022 టోర్నీకి రంగం సిద్ధమైంది. శనివారం నుంచి మొదలు కానున్న ఈటోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 28న పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లు తమ సన్నాహాలను ప్రారంభించారు. విరాట్ కోహ్లీ నుంచి హార్దిక్ పాండ్యా వరకు ఈ కీలక మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఆసియా కప్‌లో అత్యంత విజయవంతమైన భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో భాగం కాలేదు. గాయంతో ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అయితే, ఈ స్టార్ బౌలర్ లేని లోటును నేను తీర్చేస్తానంటూ టీమిండియా ఆల్ రౌండర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా.. అయితే పదండి మరి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం..

బుమ్రా బౌలింగ్‌ను అనుకరించిన హార్దిక్ పాండ్యా..

ఇవి కూడా చదవండి

ప్రాక్టీస్ సమయంలో, హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను దింపేశాడు. ఈమేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో తన కొత్త చర్య గురించి బుమ్రా నుంచి సలహా కోరాడు. ఎలా ఉంది, బూమ్? అంటూ క్యాఫ్షన్ అందించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. అభిమానులు కూడా ఈ వీడియోకు ఫిదా అవుతూ, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఆసియా కప్‌ నుంచి బుమ్రా, షమీ ఔట్..

జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సెలక్టర్లు యువ ఆటగాళ్లపై విశ్వాసం ఉంచింది. జట్టులో అనుభవజ్ఞుడైన బౌలర్ మహ్మద్ షమీ ఉన్నప్పటికీ, అతను ఆసియా కప్ వంటి పెద్ద టోర్నమెంట్లలో జట్టులో భాగం కాలేదు. కొత్త బంతితో ప్రత్యర్థికి ప్రమాదకరమని నిరూపించగల భువనేశ్వర్‌ కుమార్‌పై జట్టు ఫాస్ట్‌ బౌలింగ్‌ బాధ్యత ఉంటుంది.

బుమ్రా చాలా కాలంగా క్రికెట్‌కు దూరం..

జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ పర్యటన నుంచి క్రికెట్ ఆడలేదు. వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనల నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ప్రస్తుతం NCAలో పునరావాసం పొందుతున్నాడు. ఆసియా కప్‌నకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా.. టీ20 ప్రపంచకప్‌లో ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా జట్టులో ఉండటం భారత్‌కు చాలా ముఖ్యం.

ఆసియాకప్‌లో పాండ్యా పాత్ర కీలకం..

కొన్ని రోజుల క్రితం, హార్దిక్ పాండ్యా భార్య నటాషాతో సెలవులను గడిపి ముంబైకి తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఆసియా కప్‌నకు సన్నాహాలు ప్రారంభించాడు. ప్రస్తుత ఫామ్‌తో హార్దిక్ పాండ్యా ఆసియా కప్ 2022లో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు. ఐపీఎల్ తర్వాత బ్యాటింగ్‌తో పాటు పాండ్యా బౌలింగ్ కూడా మెరుగైంది. హార్దిక్ పాండ్యా తన బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలడు.