Watch Video: కళ్లు చెదిరే క్యాచ్.. లాంగ్ జంప్ చేసి, చిరుత కంటే వేగంతో డైవ్.. వీడియో చూస్తే నమ్మలేరు..

బ్యాట్స్‌మెన్ బౌండరీ కొట్టాడని అనుకున్నాడు. బౌలర్‌కి కూడా బౌండరీపై నిలబడిన ఆటగాడు ఆ క్యాచ్‌ని పట్టగలడని నమ్మకం లేదు. అయితే..

Watch Video: కళ్లు చెదిరే క్యాచ్.. లాంగ్ జంప్ చేసి, చిరుత కంటే వేగంతో డైవ్.. వీడియో చూస్తే నమ్మలేరు..
The Hundred Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Aug 23, 2022 | 11:09 AM

క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రతి మ్యాచ్‌లో కొన్ని ఆసక్తికర సీన్స్ ఉంటాయి. అవి నెటిజన్లకు నచ్చడంతో తెగ వైరల్ చేస్తుంటారు. ఇలాంటి సీన్.. తాజాగా ఓ మ్యాచ్‌లో కనిపించింది. పెద్దఎత్తున ఏదైనా చేయాలంటే పక్కా ప్లానింగ్ ఉండాలని అంటారు. ఓ క్యాచ్ పట్టుకోవడానికి ఫీల్డర్ కూడా అలాంటి ప్లాన్ చేశాడు. లాంగ్ జంప్ చేసి అసాధ్యమైన క్యాచ్‌ను సుసాధ్యం చేశాడు. బ్యాట్స్‌మెన్ బౌండరీ కొట్టాలని అనుకున్నాడు. బౌండరీపై నిలబడిన ఆటగాడు ఆ క్యాచ్‌ని పడతానని ఎవరూ ఊహించలేదు. అయితే అందరి ఆశలు చల్లబడిన తరుణంలో లాంగ్ జంప్ చేసి రెండు చేతులతో క్యాచ్ తీసుకుని, ఆశ్చర్యపరిచాడు.

ఈ మ్యాచ్ ఆగస్టు 22న సదరన్ బ్రేవ్ వర్సెస్ వెల్స్ ఫైర్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌ను సదరన్ బ్రేవ్ గెలుచుకుంది అయితే ఈ క్యాచ్ టీం విజయంలో కీలకంగా మారింది.

ఇవి కూడా చదవండి

క్యాచ్ కోసం లాంగ్ జంప్ చేసిన ఈ ప్లేయర్.. ఒలింపిక్స్‌లో పాల్గొంటే కచ్చింతగా స్వర్ణం పొందేవాడేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వెల్స్ ఫైర్ బ్యాట్స్‌మెన్ డ్వేన్ ప్రిటోరియస్ మైఖేల్ హొగన్ బంతికి రాస్ వైట్లీకి క్యాచ్ ఇచ్చాడు. వైట్లీ ముందుకు డైవ్ చేసి 15 గజాల పొడవు జంప్ చేసి ఈ క్యాచ్ పట్టాడు.

View this post on Instagram

A post shared by The Hundred (@thehundred)

షార్ట్ టైంలో ఫర్‌ఫెక్ట్ క్యాచ్..

డ్వేన్ ప్రిటోరియస్ అవుట్ అయినప్పుడు, అతను కేవలం 7 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో అతను 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. అంటే మరికొంత సమయం వికెట్‌పై నిలబడి ఉంటే సదరన్ బ్రేవ్ సాధించాల్సిన 130 పరుగుల లక్ష్యం పెద్దది అయ్యేది.

వెల్స్ ఫాయక్‌తో జరిగిన మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 130 పరుగుల విజయ లక్ష్యాన్ని 18 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.