ASIA CUP 2022: టీమిండియాలో కోవిడ్ కలకలం.. పాజిటివ్‌గా తేలిన రాహుల్ ద్రవిడ్?
ఆసియా కప్ 2022 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శనివారం నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. ఈమేరకు టీమిండియా కూడా యూఏఈ వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
ఆసియా కప్ 2022 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. టీమిండియా కూడా యూఏఈ వెళ్లేందుకు సిద్ధమవుతోంది. కాగా, మంగళవారం ఉదయం భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టుతో కలిసి యూఏఈ వెళ్లడం లేదంటూ వార్తలు వచ్చాయి. మీడియా నివేదికల ప్రకారం, ద్రవిడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిందని తెలుస్తోంది. దీంతో ద్రవిడ్ ఆసియా కప్‌లో కూడా పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. నివేదికల ప్రకారం, యూఏఈకి బయలుదేరే ముందు భారత కోచ్ కోవిడ్ 19 టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ద్రవిడ్ ఆరోగ్యంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన విడుదల చేసింది.
లక్ష్మణ్‌కు కోచ్ బాధ్యతలు..
ఒకవేళ ద్రవిడ్ ఆసియా కప్ 2022కు దూరమైతే యూఏఈలో వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించవచ్చు. నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ లక్ష్మణ్ గత 3 నెలలుగా టీమ్ ఇండియాతోనే ఉన్నారు. జింబాబ్వే పర్యటనలో టీం ఇండియాకు కోచ్‌గా ఉన్నారు. అక్కడ భారత్ 3-0తో ODI సిరీస్‌ను గెలుచుకుంది. నిజానికి ఆసియాకప్‌నకు ముందు ద్రవిడ్‌కు విశ్రాంతినిచ్చి జింబాబ్వే టూర్‌లో లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించారు. కానీ, ఆసియాకప్‌కు ముందు ద్రవిడ్‌పై వార్తలు రావడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఆగస్టు 28న పాకిస్థాన్‌తో ఆసియా కప్‌లో భారత్ తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.
NEWS – Head Coach Rahul Dravid tests positive for COVID-19.
More details here – https://t.co/T7qUP4QTQk #TeamIndia
— BCCI (@BCCI) August 23, 2022
భారత్‌కు వరుస షాక్‌లు..
ఆసియా కప్‌నకు ముందు భారత్‌కు ఒకదాని తర్వాత ఒకటిగా భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయం కారణంగా ఇప్పటికే టోర్నీకి దూరమవగా, తాజాగా టీమ్ ఇండియాకు ద్రవిడ్ మద్దతు కూడా లభించడం లేదు. ఐర్లాండ్‌పై టీమ్ ఇండియా బాధ్యతలను కూడా లక్ష్మణ్ తీసుకున్నాడు. ఇప్పుడు అతను ఆసియా కప్‌లో కూడా తన విజయ ప్రయాణాన్ని కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.