27 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లు.. 211 స్ట్రైక్‌రేట్‌తో తుఫాన్ హాఫ్ సెంచరీ.. బెంగళూరులో టీమిండియా ప్లేయర్ బీభత్సం..

Maharaja T20 League: కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ టీ20 టోర్నమెంట్‌లో మనీష్ పాండే అద్భుత ఆటతో సత్తా చాటుతూ టోర్నీలో ఇప్పటివరకు 4 హాఫ్ సెంచరీలు సాధించాడు.

27 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లు.. 211 స్ట్రైక్‌రేట్‌తో తుఫాన్ హాఫ్ సెంచరీ.. బెంగళూరులో టీమిండియా ప్లేయర్ బీభత్సం..
Maharaja T20 League Gulbarga Mystics Manish Pandey
Follow us
Venkata Chari

|

Updated on: Aug 22, 2022 | 9:33 AM

ఈ రోజుల్లో జింబాబ్వేలో టీమిండియాలోని పలువురు స్టార్లు తమ సత్తా చాటుతున్నారు. ఇంగ్లండ్‌లోని కౌంటీ క్రికెట్‌లో కొందరు తమ సత్తా చాటుతున్నారు. టీమ్ మొత్తం ఆసియా కప్ సన్నాహాల్లో నిమగ్నమై ఉంది. అదే సమయంలో ఇటీవలి నెలల్లో టీమిండియాకు దూరంగా ఉన్న కొంతమంది ఆటగాళ్లు ఉన్నారు. కానీ, వివిధ స్థాయిలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, వెలుగులోకి వస్తున్నారు. వీరిలో వెటరన్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే కూడా ఒకరు. పాండే ప్రస్తుతం తన రాష్ట్రం కర్ణాటక మహారాజా T20 లీగ్‌లో ఆడుతూ బ్యాట్‌తో రచ్చ సృష్టిస్తున్నాడు.

కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ T20 టోర్నమెంట్‌లో, గుల్బర్గా మిస్టిక్స్ తరపున ఆడుతున్న, వెటరన్ బ్యాట్స్‌మెన్, జట్టు కెప్టెన్ మనీష్ పాండే ఇప్పటికే 3 అర్ధ సెంచరీలు సాధించాడు. ఆగస్టు 21వ తేదీ ఆదివారం మరోసారి తన మెరుపు ఆటతో ప్రదర్శించి బౌలర్లను చిత్తు చేసి మరో అర్ధ సెంచరీ కొట్టాడు.

మనీష్ పాండే అద్భుత ఫిఫ్టీ..

ఇవి కూడా చదవండి

బెంగళూరులో ఆదివారం గుల్బర్గా, మైసూరు వారియర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో మనీష్ పాండే జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే జట్టు ఆరంభం అంతగా రాణించకపోవడంతో 10వ ఓవర్‌కు 68 పరుగులకే 3 వికెట్లు పడిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి దిగిన కెప్టెన్ మనీష్ పాండే.. వచ్చిన వెంటనే మైసూరు బౌలర్లపై దాడి చేయడం ప్రారంభించాడు.

ఈ సమయంలో మనీష్ పాండే 18వ ఓవర్లో అద్భుతమైన సిక్సర్‌తో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అతను కేవలం 26 బంతుల్లోనే ఈ అర్ధశతకం పూర్తి చేసి, తర్వాతి బంతికే ఫోర్ కొట్టాడు.

వర్షం కారణంగా ఆగిన పరుగుల తుఫాన్..

మనీష్ పాండే జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. 18వ ఓవర్‌కు జట్టు స్కోరు 148 పరుగులుగా నిలిచింది. పాండే బ్యాట్‌తో పరుగులు విజృంభించడంతో అతడిని ఆపడం మైసూరుకు కష్టతరంగా మారింది. అయితే వర్షం రూపంలో మాత్రం అడ్డుపడింది. దీంతో వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఆట ఆగే వరకు మనీష్ పాండే 27 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. అంతకుముందు అతను కృష్ణన్ శ్రీజిత్‌తో కలిసి 39 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా అందించాడు.

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?