Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోడ్డుపై వెళ్తున్న కారు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా ఉహించని సీన్.. నెటిజన్లకు షాకిస్తోన్న వీడియో..

ప్రమాదం లేదా మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత ఒళ్లు జలదరించాల్సిందే.

Viral Video: రోడ్డుపై వెళ్తున్న కారు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా ఉహించని సీన్.. నెటిజన్లకు షాకిస్తోన్న వీడియో..
Lightning Suddenly Fell On A Moving Car Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Aug 21, 2022 | 3:09 PM

రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ప్రమాదాలు ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చి ఎవరి ప్రాణాలకు ముప్పు తెస్తాయో తెలియదు. కాలినడకన లేదా కారులో వెళ్తున్నా, చాలా జాగ్రత్తలు అవసరం. కానీ, ఆకాశం నుంచి వచ్చే ప్రమాదాన్ని మాత్రం మనం ఏం చేయలేం. ఇవి పిడుగుల రూపంలో నిత్యం ఎంతో మందిని బలి తీసుకుంటున్నాయి. ఇవి ఎప్పుడు భూమి మీద పడతాయో చెప్పడం చాలా కష్టం. అయితే, తాజాగా ఇలాంటి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి మీరు కూడా ఒళ్లు జలదరించాల్సిందే.

రోడ్డుపై వెళ్తున్న కారుపై అకస్మాత్తుగా ఆకాశంలో మెరుపు తాకింది. వీడియోలో రోడ్డుపై నెమ్మదిగా ప్రయాణిస్తున్నట్లు చూడొచ్చు. మెరుపు కారు వెనుక వైపు పడటంతో ఎంతో అదృష్టం కలిసి వచ్చింది. దీని వల్ల ఎటువంటి నష్టం జరగలేదు. లేకపోతే కారు మధ్యలో లేదా ముందు భాగంలో పిడుగు పడినట్లయితే, అది భారీ నష్టం కలిగించి, బహుశా ప్రాణాలను కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో విసియస్ వీడియోస్ అనే ID తో షేర్ చేశారు. కేవలం 5 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పటి వరకు వేల మంది వీక్షించారు.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియో చూడండి..

ఆకాశం నుంచి మెరుపు కారుపై పడటం మీరు చూశారు కదా.. ఇప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించే మరికొన్ని వైరల్ వీడియోలను చూద్దాం.

ఇప్పుడు రెడ్ లైట్ మీద నిలబడటం కూడా సురక్షితం కాదని, ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..

రేసింగ్ కారు ఘోర ప్రమాదానికి గురైంది..

ఒక్కసారిగా షాపులో భయంకరమైన పేలుడు..

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..