Viral Video: వేటాడేందుకు చెట్టెక్కిన సింహం.. కట్ చేస్తే షాకింగ్ సీన్.. నెట్టింట వైరల్ వీడియో..
నెట్టింట్లో వైరలయ్యే వీడియోలో ఓ సింహం, తను వేటాడే జంతువు కోసం విఫలయత్నాలు చేసింది. కానీ, చివర్లో అదిరిపోయే ట్విస్ట్‌తో సింహం నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.
నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని వీడియోలు షాక్ ఇస్తుంటాయి. ఇవి నెటిజన్లకు నచ్చడంతో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియోని ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సింహం, చిరుత వంటి పెద్ద జంతువులను వేటాడే శైలి తప్పక చూడాల్సిందే. ఇలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఇందులో జంతువులు ఒకదానికొకటి వేటాడడాన్ని చూడొచ్చు. సింహం అడవిలో క్రూరమైన వేటగాడి స్థానాన్ని దక్కించుకుంది. చాలా నిర్దాక్షిణ్యంగా మిగతా జంతువుల్ని చంపేస్తుంటుంది. దాని గర్జనకు అడవి మొత్తం వణికిపోతుందనే వాస్తవం నుంచి దాని శక్తిని అంచనా వేయవచ్చు. అంత శక్తివంతంగా ఉన్నప్పటికీ, సింహం చెట్టు ఎక్కలేదు. అడవిని పాలించే సింహం చెట్టు ఎక్కలేకపోవడమే సింహానికి శాపంగా భావించవచ్చు. కానీ, వేట అనే దురాశతో చాలాసార్లు సింహం ఓ తప్పు చేయడంతో.. వేటను పూర్తి చేయలేక నిరాశే మిగిలింది.
వీడియో చూడండి..
సింహం ఎరను అనుసరించి చెట్టు ఎక్కింది. సింహం ఇలా తన వైపునకు రావడం చూసిన జంతువు చెట్టును త్వరగా దిగి, ఇరుకైన సందులో నక్కింది. ఆతర్వాత ఎర చెట్టుపై నుంచి నేలపైకి దూకగానే.. సింహం కూడా వెంటనే చెట్టుపై నుంచి దిగేందుకు ప్రయత్నించింది. కానీ, అడవి రాజు చెట్టు సులభంగా ఎక్కినంతగా, దిగలేకపోయింది. నెమ్మదిగా చెట్టు నుంచి కిందికి రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇంతలో దాని బరువు కారణంగా, తన బ్యాలెన్స్ కోల్పోయి నేలపై అమాంతం పడిపోయింది. సింహం కింద పడిన తీరు చూస్తే.. తీవ్రంగా గాయపడి ఉంటుందని ఊహించవచ్చు. ఆ తర్వాత ఆ జంతువులు అక్కడి నుంచి తప్పించుకుని, తన ప్రాణాన్ని కాపాడుకున్నాయి. వరల్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనే యూట్యూబ్ ఖాతా ద్వారా ఈ ఫన్నీ వీడియో షేర్ చేశారు. వార్తలు రాసే వరకు వేల సంఖ్యలో వ్యూస్, లైక్‌లను పొందింది.