Anand Mahindra: ట్విట్టర్‌లో ఆనంద్‌ మహీంద్రాను ఆకట్టుకున్న యువకుడు.. అతని తెలివికి ఫిదా అంటూ ప్రశంసలు..

తాజాగా, ఆ యువకుడి అభ్యర్థనకు స్పందించిన ఆనంద్‌ మహీంద్రా.. అతణ్ని సంప్రదించాలంటూ సిబ్బందికి సూచించారు. అతని వీడియోపై స్పందిస్తూ..

Anand Mahindra: ట్విట్టర్‌లో ఆనంద్‌ మహీంద్రాను ఆకట్టుకున్న యువకుడు.. అతని తెలివికి ఫిదా అంటూ ప్రశంసలు..
Anand Mahindra
Follow us

|

Updated on: Aug 21, 2022 | 12:46 PM

Anand Mahindra: మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్, భారతదేశపు అతిపెద్ద వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ఖాతా స్ఫూర్తిదాయకమైనది. ఆసక్తికరమైన చమత్కారమైన ట్వీట్ల నిధి అది. ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే మహీంద్రా, తన అనుచరుల కామెంట్లు, ప్రశ్నలకు కూడా ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తుంటారు. ఇంకా ఎక్కువగా, అతను తరచుగా వారి పోస్ట్‌లను షేర్ చేస్తాడు/రీట్వీట్ చేస్తాడు. అలా చేయటాన్ని అతను ఎంతో విలువైనదిగా భావిస్తాడు. ఇటీవల, మహీంద్రా ఒక పాత జీప్‌ను విజయవంతంగా పనిచేసే ఎలక్ట్రిక్ వాహనంగా మార్చిన తమిళనాడుకు చెందిన ఓ యువకుడి ప్రతిభకు ముగ్ధుడయ్యారు! విద్యుత్‌ వాహనం(EV)లో చేపట్టిన మార్పులను చూపుతూ ఉద్యోగాన్ని కోరిన అతని విషయంలో సానుకూలంగా స్పందించారు.

ఆనంద్‌ మహీంద్రా ఇటీవల ఓ ఎలక్ట్రిక్‌ కారుపై ట్వీట్‌ చేశారు. దీనిపై ఎ. గౌతమ్‌ అనే యువకుడు స్పందిస్తూ..తన ఎలక్ట్రిక్ జీప్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. వీడియో ద్వారా జీప్ దాని ముందు, వెనుక చక్రాలను విడివిడిగా నియంత్రించగలిగేలా నిర్మించబడిందని గౌతమ్ ప్రదర్శించారు. “దయచేసి నాకు ఉద్యోగం ఇప్పించండి సార్” అని మహీంద్రా గ్రూప్ చైర్మన్‌ని ఉద్దేశించి వీడియోతో పాటు ట్యాగ్‌లైన్‌ రాశాడు.

ఇవి కూడా చదవండి

తాజాగా, ఆ యువకుడి అభ్యర్థనకు స్పందించిన ఆనంద్‌ మహీంద్రా.. అతణ్ని సంప్రదించాలంటూ సిబ్బందికి సూచించారు. అతని వీడియోపై స్పందిస్తూ.. ‘ఇందుకే.. ‘ఈవీ’ల్లో భారత్‌ అగ్రగామిగా నిలుస్తుందని నమ్ముతున్నా. కార్లు, సాంకేతికతపై మక్కువ, గ్యారేజ్‌లో వినూత్న ప్రయోగాల కారణంగానే ఆటోమొబైల్‌ రంగంలో అమెరికా తన ఆధిపత్యాన్ని చాటింది. గౌతమ్‌తోపాటు అలాంటి వ్యక్తులు మరింత ఎదగాలి’ అని ఆకాంక్షించారు. మహీంద్రా స్పందన కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు