Junior NTR-Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటి కానున్న జూనియర్ ఎన్టీఆర్..

అమిత్‌ షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ డిన్నర్‌మీట్‌ కాబోతున్నారు. అమిత్‌ షా ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ డిన్నర్‌కు వెళ్తున్నారు. 15 నిమిషాల పాటు ఇద్దరి సమావేశం జరగనుంది.

Junior NTR-Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటి కానున్న జూనియర్ ఎన్టీఆర్..
Junior Ntr To Meet Amit Sha
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 21, 2022 | 12:50 PM

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనలో ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అమిత్‌ షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ డిన్నర్‌మీట్‌ కాబోతున్నారు. అమిత్‌ షా ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ డిన్నర్‌కు వెళ్తున్నారు. 15 నిమిషాల పాటు ఇద్దరి సమావేశం జరగనుంది. ఇటీవల ట్రిపులార్‌ సినిమాను చూశారు కేంద్ర మంత్రి అమిత్‌ షా. అందులో ఎన్టీఆర్‌ నటనకు ఫిదా అయ్యారు. దీంతో.. ఆయనతో మాట్లాడాలని అమిత్‌షా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్‌ షా – ఎన్టీఆర్ లంచ్‌ మీటింగ్ జరగబోతోంది. ఇదే సమావేశంలో సినిమాతోపాటు పలు రాజకీయ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇదిలావుంటే.. ఓ సామాన్య కార్యకర్త ఇంటికివెళ్లనున్నారు అమిత్ షా. బేగంపేట ఎయిర్ ఫోర్ట్ నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం.. మొండా డివిజన్ సాంబ మూర్తి నగర్‌లోని బీజేపీ కార్యకర్త ఇంట్లో టీ తాగనున్నారు. సాంబమూర్తి నగర్ లో ఉండే మంద సత్యనారాయణ.. 30 సంవత్సరాల నుంచి బీజేపీ కోసం పని చేస్తున్నారు.

ప్రస్తుతం సత్యనారాయణ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఎస్సి మోర్చ సెక్రెటరీగా పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సత్యనారాయణ ఇంట్లోనే చాయ్ తాగి వారితో కాసేపు మాట్లాడనున్నారు అమిత్ షా.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!