Video: ఇదేం ఊచకోత సామీ.. 4గురు బ్యాటర్లు.. 200పైగా స్ట్రైక్‌రేట్‌తో 14 సిక్సర్లు.. దెబ్బకు ప్రత్యర్ధి బౌలర్ల గుండె గుభేల్..

The Hundred: మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు చెందిన 5గురు బ్యాట్స్‌మెన్స్ స్ట్రైక్ రేట్ 200 దాటింది. ఫిల్ సాల్ట్ అత్యధిక స్ట్రైక్ రేట్‌తో పరుగుల వర్షం కురిపించాడు. ఏకంగా 5 సిక్సర్లు కొట్టాడు.

Video: ఇదేం ఊచకోత సామీ.. 4గురు బ్యాటర్లు..  200పైగా స్ట్రైక్‌రేట్‌తో 14 సిక్సర్లు.. దెబ్బకు ప్రత్యర్ధి బౌలర్ల గుండె గుభేల్..
The Hundred
Follow us
Venkata Chari

|

Updated on: Aug 22, 2022 | 9:21 AM

The Hundred: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక క్రికెట్ లీగ్‌లు జరుగుతున్నాయి. ప్రతి లీగ్‌లో ఏదో ఒక సమయంలో భారీ స్కోర్లు నమోదవుతూనే ఉన్నాయి. ఆ లీగ్ లేదా టోర్నమెంట్ చరిత్రలో కూడా ఈ స్కోర్ భారీదనే నిరూపితమువుతోంది. ఆగస్టు 21 సాయంత్రం, ఇంగ్లండ్‌లో జరిగిన 100 బంతుల టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’లో ఇలాంటి స్కోర్ నమోదైంది. మాంచెస్టర్ ఒరిజినల్స్ వర్సెస్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ పురుషుల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇది ఈ టోర్నమెంట్‌లో అత్యధిక స్కోరు చేసిన మ్యాచ్‌గా మారింది. మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టుపేరుతో ఈ భారీ స్కోర్ నమోదైంది.

మాంచెస్టర్ ఒరిజినల్స్ ఈ భారీ స్కోర్ ఎలా సాధించిందో ఇప్పుడు చూద్దాం.. 5గురు బ్యాట్స్‌మెన్స్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ బౌలర్లను చితకబాదేశారు. దీంతో పరుగుల వర్షం కురిసింది. ఈ ప్రతి బ్యాట్స్‌మెన్ స్ట్రైక్ రేట్ 200 దాటింది. నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ మొత్తం 6 మంది బౌలర్‌లను ప్రయత్నించారు. కానీ, వారిలో ఎవరూ మాంచెస్టర్ ఒరిజినల్స్‌లోని బ్యాట్స్‌మెన్‌లపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.

ఇవి కూడా చదవండి

భారీ స్కోరుకు పునాది..

మాంచెస్టర్ ఒరిజినల్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్, ఆ టీం కెప్టెన్ కెప్టెన్ లారీ ఎవాన్స్ అద్భుతంగా ఆకట్టుకున్నారు. సాల్ట్ 25 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 220 స్ట్రైక్ రేట్‌తో 55 పరుగులు చేశాడు. అదే సమయంలో ఇవాన్ 19 బంతుల్లో 236.84 స్ట్రైక్ రేట్‌తో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు.

ఓపెనింగ్ బ్లాస్ట్ తర్వాత మిడిల్ ఆర్డర్ తుఫాన్ ఇన్నింగ్స్..

ఓపెనింగ్ జోడీ కేవలం 42 బంతుల్లోనే 102 పరుగులు జోడించడంతో.. మిగతా బ్యాట్స్‌మెన్‌లో కూడా ఉత్సాహం ఉరకలెత్తింది. దీని తర్వాత, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన ట్రిస్టన్ స్టబ్స్ 23 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్‌తో 46 పరుగులు చేశాడు. 5 సిక్సర్లు కూడా కొట్టాడు. పాల్ వాల్టర్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 216.66 స్ట్రైక్ రేట్‌తో 26 పరుగులు చేశాడు. ఆండ్రీ రస్సెల్ 17 బంతుల్లో 100 స్ట్రైక్ రేట్‌తో 17 పరుగులు చేయగా, వేన్ మాడ్సెన్ 200 స్ట్రైక్ రేట్‌తో 3 బంతుల్లో 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

View this post on Instagram

A post shared by The Hundred (@thehundred)

24 సిక్సర్లు.. మాంచెస్టర్ ఒరిజినల్స్ 23 పరుగుల తేడాతో విజయం..

మాంచెస్టర్ ఒరిజినల్స్ బ్యాట్స్‌మెన్స్ సత్తా చాటడంతో, మాంచెస్టర్ ఒరిజినల్స్ 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఇది ఈ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరుగా నిలిచింది. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ 209 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. అయితే ఆ టీం 185 పరుగుల వద్ద ఆగి 23 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయారు.

మాంచెస్టర్ ఒరిజినల్స్ వర్సెస్ నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 24 సిక్సర్లు నమోదయ్యాయి. వాటిలో 16 సిక్సర్లు మాంచెస్టర్ ఒరిజినల్స్ బ్యాట్స్‌మెన్ కొట్టినవే కావడం విశేషం.

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?