- Telugu News Photo Gallery Cricket photos Team India player sanju samson 1st indian wicketkeeper to win odi man of the match award in zimbabwe telugu cricket news
Sanju Samson: జింబాబ్వేలో సరికొత్త రికార్డ్ సృష్టించిన శాంసన్.. తొలి భారత వికెట్ కీపర్‌గా ప్రపంచ రికార్డ్..
IND vs ZIM: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. దీంతో శాంసన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
Updated on: Aug 21, 2022 | 10:42 AM

వన్డే సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. ఇప్పుడు సిరీస్‌లో చివరి మ్యాచ్ రేపు జరగనుంది.

రెండో వన్డేలో భారత్ తరపున వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇందుకు గాను అతనికి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. శాంసన్ తన పేరిట ప్రత్యేక రికార్డు సృష్టించాడు.

జింబాబ్వేలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్న తొలి భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా సంజూ నిలిచాడు. అతని ముందు ఏ భారత వికెట్‌కీపర్ కూడా ఈ పని చేయలేకపోయాడు. రెండో వన్డేలో సంజూ 39 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో శాంసన్ 110.26 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ఈ సమయంలో శార్దూల్ ఠాకూర్ భారత్ తరపున చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 7 ఓవర్లలో 38 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్ 8 ఓవర్లలో 16 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. సిరాజ్ మెయిడిన్ ఓవర్ కూడా సంధించాడు. ప్రసీద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడాలకు ఒక్కో వికెట్ దక్కింది.

జింబాబ్వే ఇచ్చిన లక్ష్యాన్ని భారత జట్టు 25.4 ఓవర్లలో ఛేదించింది. శాంసన్‌తో పాటు శిఖర్ ధావన్ కూడా టీమిండియా తరుపున మంచి ప్రదర్శన చేశాడు. 21 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ధావన్ ఈ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు ఉన్నాయి. శుభ్‌మన్ గిల్ 34 ఓవర్లలో 33 పరుగులు చేయగా.. దీపక్ హుడా 25 పరుగులు చేశాడు.





























