IND vs ZIM: ఈ టీమిండియా ఆల్ రౌండర్ జట్టులో ఉంటే.. గెలుపు గ్యారెంటీ.. వరుసగా 16 విక్టరీలతో సరికొత్త రికార్డ్..

జింబాబ్వేతో జరిగిన రెండో ODIలో దీపక్ హుడా తన ఆఫ్-స్పిన్ బౌలింగ్‌తో ప్రమాదకరంగా మారిన వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ శాంసన్‌తో కలిసి బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

IND vs ZIM: ఈ టీమిండియా ఆల్ రౌండర్ జట్టులో ఉంటే.. గెలుపు గ్యారెంటీ.. వరుసగా 16 విక్టరీలతో సరికొత్త రికార్డ్..
Indian Cricket Team
Follow us

|

Updated on: Aug 21, 2022 | 8:53 AM

జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వేపై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విధంగా కేఎల్ రాహుల్ సారథ్యంలో టీమిండియా తొలి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు గత మ్యాచ్‌‌తో పోల్చితే కాస్త ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. గెలిచేందుకు కొన్ని ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి దీపక్ హుడా కూడా అని మీకు తెలుసా. అవును.. ఈ ఆటగాడు విజయానికి కేరాఫ్ అడ్రస్‌లా మారాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడు ఇలా ఎందుకు చెబుతున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. సహజంగానే, దీపక్ హుడా జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అతను నిలకడగా రాణిస్తున్నాడు. అతను ఈ సంవత్సరం భారత జట్టు కోసం ODI, T20 ఫార్మాట్లలో చాలా మ్యాచ్‌లు ఆడాడు. అతని ప్రదర్శన దాదాపు ప్రతి మ్యాచ్‌లో బాగానే ఆకట్టుకుంది. అతను బ్యాట్‌తో అద్భుతాలు చేయడమే కాదు, బంతితో కూడా తన సహకారం అందించాడు. ఇది అమూల్యమైనదిగా నిరూపితమైంది.

దీపక్ హుడా ఉంటే గెలుపు గ్యారెంటీ..

ఇవి కూడా చదవండి

ఈ సహకారంతో పాటు దీపక్ హుడా కూడా టీమ్ ఇండియాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. జింబాబ్వేపై విజయంతో దీపక్ హుడా పేరిట అపూర్వ రికార్డు నమోదైందని చెబుతున్నారు. దీపక్ హుడా ఈ ఏడాది అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను ODIలు, T20లతో సహా భారతదేశం కోసం మొత్తం 16 మ్యాచ్‌లు ఆడాడు.

ఈ 16 మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించడం యాదృచ్ఛికం. అయితే ఇది సరికొత్త రికార్డుగా నిలిచింది. ఇప్పటి వరకు ఏ ఆటగాడు అరంగేట్రం చేసినప్పటి నుంచి వరుసగా ఇన్ని మ్యాచ్‌లు గెలవలేదు.

ఈ క్రమంలో వరుసగా 15 మ్యాచ్‌లు గెలిచి రికార్డు సృష్టించిన క్రికెట్ మ్యాప్‌లో చిన్న దేశమైన రొమేనియాకు చెందిన సాత్విక్ నడిగొట్ల రికార్డును హుడా బద్దలు కొట్టాడు. వీరిద్దరూ కాకుండా, రొమేనియాకు చెందిన శంతను వశిష్ట్, వెటరన్ సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ అరంగేట్రం తర్వాత వరుసగా తలో 13 మ్యాచ్‌లను గెలుచుకున్నారు.

నిలకడకు మారుపేరు..

అయితే, ఇది అదృష్టం మాత్రమే కాదు, హుడా కూడా అన్ని విభాగాల్లో తన సహకారాన్ని అందించాడు. జింబాబ్వేతో శనివారం జరిగిన రెండో వన్డేలో 42 బంతుల్లో 42 పరుగులు చేసి ప్రమాదకరంగా పరిణమిస్తున్న షాన్ విలియమ్స్‌ను తన ఆఫ్‌బ్రేక్ బౌలింగ్‌తో హుడా మొదట వికెట్‌ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 97 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమయంలో సంజూ శాంసన్‌తో కలిసి 56 పరుగుల భాగస్వామ్యంతో విజయాన్ని అందుకుంది. ఈ సమయంలో హుడా 25 పరుగులు చేశాడు. హుడా 16 మ్యాచ్‌లు ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీతో సహా 414 పరుగులు చేశాడు. 3 వికెట్లు కూడా తీశాడు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!