Watch Video: ఊరమాస్ స్టెప్పులతో దుమ్ము రేపిన భారత ఆటగాళ్లు.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..
జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
విజయం ఏదైనా సరే, సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. కొంతకాలంగా వరుస గెలుపులతో దైకుడు పెంచిన టీమిండియా, మైదానంలో తన ప్రదర్శనతో పాటు విజయాన్ని ఆస్వాదించాలనే ఈ నియమాన్ని కూడా మరచిపోలేదు. అందుకే జింబాబ్వేతో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో విజయంతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ విజయోత్సవంలో ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. ఆగస్టు 22 సోమవారం జరిగిన వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 289 పరుగులు చేసింది. టీమిండియా తరపున శుభ్‌మన్ గిల్ 130 పరుగులు చేశాడు. దీనికి సమాధానంగా కష్టాల్లో పడిన సికందర్ రజా అద్భుత సెంచరీతో జింబాబ్వేను మ్యాచ్‌లో నిలదొక్కుకునేలా చేశాడు. అతను జట్టును గెలిపించేలా కనిపించాడు. కానీ, చివరికి అతనిని అవుట్ చేయడం ద్వారా టీమిండియా మ్యాచ్‌లో గెలిచేలా చేసింది.
ఈ విజయం తర్వాత టీమిండియా ప్రస్తుతం దేశానికి తిరిగి రావాల్సి ఉంది. అయితే స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధమయ్యే ముందు.. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని టీమిండియా కోల్పోలేదు. సీనియర్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో డ్రెస్సింగ్ రూమ్ లోపల నుంచి జట్టు వేడుకల వీడియోను పంచుకున్నాడు. దీనిని చూసిన తర్వాత నవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోలో ప్రముఖ పంజాబీ పాట ‘కాలా చష్మా’కు భారత జట్టులోని స్టార్లు అంతా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
View this post on Instagram
డ్యాన్స్ ప్రారంభమయ్యే ముందు, యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ తన స్పెషల్ డ్యాన్స్ టాలెంట్ చూపించాడు. ఇదే క్రమంలో ధావన్, శుభ్‌మన్ గిల్ కూడా తమ డ్యాన్స్ స్కిల్స్‌ను ప్రదర్శించారు.
గిల్ కెరీర్‌లో మరపురాని సిరీస్..
గిల్ డ్యాన్స్‌తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచడమే కాకుండా, అంతకు ముందు బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో కూడా ఆకట్టుకున్నాడు. 9వ వన్డే ఆడుతున్న శుభ్‌మన్ గిల్ తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన గిల్ 82 బంతుల్లో సెంచరీ సాధించాడు. 97 బంతుల్లో 130 పరుగులు చేశాడు. ఈ విధంగా యువ బ్యాట్స్‌మెన్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 245 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. దీనికి ముందు, వెస్టిండీస్ పర్యటనలో గిల్ వన్డే సిరీస్‌లో ఈ అవార్డును గెలుచుకున్నాడు.