Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నీ జెర్సీ కావాలంటూ గబ్బర్‌ని కోరిన అభిమాని.. ధావన్ రిప్లైతో నవ్వులే నవ్వులు.. వైరల్ వీడియో

మూడో మ్యాచ్‌లో హీరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో గిల్ 245 పరుగులు చేశాడు. అయితే వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా తక్కువేమీ కాదు.

Watch Video: నీ జెర్సీ కావాలంటూ గబ్బర్‌ని కోరిన అభిమాని.. ధావన్ రిప్లైతో నవ్వులే నవ్వులు.. వైరల్ వీడియో
Ind Vs Zim 3rd Odi Shikhar Dhawan
Follow us
Venkata Chari

|

Updated on: Aug 23, 2022 | 1:37 PM

జింబాబ్వేపై స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ను భారత జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మూడో మ్యాచ్‌లో భారత జట్టు చివరి ఓవర్‌లో 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లోని చివరి వన్డే మ్యాచ్ సోమవారం (ఆగస్టు 22) టీమిండియా-జింబాబ్వే మధ్య చాలా ఉత్కంఠభరితంగా సాగింది. మూడో మ్యాచ్‌లో హీరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో గిల్ 245 పరుగులు చేశాడు. అయితే వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా తక్కువేమీ కాదు. 154 పరుగులతో సిరీస్‌లో రెండో టాప్ స్కోరర్‌గా కూడా నిలిచాడు.

గబ్బర్‌గా పేరుగాంచిన ధావన్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జింబాబ్వేలో కూడా జబ్రా అభిమాని కనిపించాడు. ఈ అభిమాని రన్నింగ్ మ్యాచ్‌లోనే శిఖర్ ధావన్‌ని షర్ట్ అడిగాడు. దీనికి ధావన్ కూడా ఫన్నీ సమాధానం ఇవ్వడంతో తోటి ఆటగాళ్లు కూడా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

నిజానికి ఈ ఘటన భారత ఇన్నింగ్స్‌లో 27వ ఓవర్‌లో జరిగింది. ధావన్ ఔట్ అయ్యి డగౌట్‌లో కూర్చున్నాడు. ఇంతలో ఓ అభిమాని తన చేతిలోని కార్డుపై ‘శిఖర్ ధావన్ నీ చొక్కా తీసుకోనా?’ అని రాసి ఉన్న ఓ ఫ్లకార్డును చూపించాడు. దీనిని స్క్రీన్‌లో చూపించడంతో అంతా నవ్వుకున్నారు.

ఈ అభిమానిని చూసిన ధావన్ డగౌట్‌లో కూర్చుని టీషర్ట్ తీసేందుకు ప్రయత్నించాడు. దీనిపై పక్కనే కూర్చున్న రితురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్ కూడా నవ్వడం మొదలుపెట్టారు. అయితే, ధావన్ టీ షర్ట్ తీసి మరలా వేసుకున్నాడు.

శార్దుల్ జెర్సీతో బరిలోకి దిగిన ధావన్..

మ్యాచ్‌లో ధావన్ తన జెర్సీని ధరించలేదు. సహచర ఆటగాడు శార్దూల్ ఠాకూర్ జెర్సీని ధరించి మైదానంలోకి దిగాడు. ఈ జెర్సీపై రాసిన పేరును కూడా టేపుతో కప్పారు. ఈ టేప్‌ను పెట్టేటప్పుడు సహాయక సిబ్బంది కూడా కెమెరాలో కనిపించారు. అయితే, ధావన్ శార్ధుల్ జెర్సీని ఎందుకు ధరించాడో మాత్రం తెలియరాలేదు.

మూడో వన్డేలో భారత జట్టు విజయం..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆరంభంలో లయకు నోచుకోకపోవడంతో భారత్ 15 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్‌కు 63 పరుగులు చేయగలిగింది. కానీ, 130 పరుగుల ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ 15 ఫోర్లు, ఒక సిక్స్‌తో గొప్ప లయలో కనిపించాడు. ఇషాన్ కిషన్ 61 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 8 వికెట్లకు 289 పరుగులు చేసింది.

జవాబుగా ఆతిథ్య జింబాబ్వే జట్టు అద్భుత ఆటతీరు కనబరిచి 276 పరుగులు మాత్రమే చేయగలిగింది. జింబాబ్వేకు చెందిన సికందర్ రజా (115 పరుగులు) అద్భుత సెంచరీ చేసి జట్టును గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. భారత్ తరపున అత్యధికంగా మూడు వికెట్లు అవేశ్ ఖాన్ పడగొట్టాడు. దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.