Puri Jagannadh: బాలీవుడ్‌కు ”బిజినెస్ మేన్”.. సూర్య భాయ్‌గా కనిపించేది ఆ హీరోనేనా..?
లైగర్ ప్రమోషన్ సందర్భంగా ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. బిజినెస్‌మేన్ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయాలన్న ఆలోచన ఎప్పటినుంచో ఉందన్న విషయాన్ని రివీల్ చేశారు.
లైగర్ ప్రమోషన్ సందర్భంగా ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh). బిజినెస్‌మేన్ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయాలన్న ఆలోచన ఎప్పటినుంచో ఉందన్న విషయాన్ని రివీల్ చేశారు. పూరి ఈ మాట అనటమే ఆలస్యం.. ఈ క్రేజీ మూవీకి కాంబినేషన్స్ సెట్ చేసే పనిలో పడ్డారు ఫ్యాన్స్. మహేష్ కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాలో బిజినెస్‌మేన్ కూడా ఒకటి. డిఫరెంట్ మేనరిజమ్స్, యాటిట్యూడ్‌తో సూపర్ స్టార్‌ను సిల్వర్ స్క్రీన్ మీద చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు పూరి జగన్నాథ్. అందుకే ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచే సీక్వెల్ గురించి చర్చ మొదలైంది. పూరి కూడా గతంలోనే సీక్వెల్, రీమేక్ గురించి కామెంట్స్ చేశారు. తాజాగా లైగర్ రిలీజ్ సందర్భంగా మరోసారి బిజినెస్‌మేన్ రీమేక్ గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్.
బాలీవుడ్‌లో బిజినెస్‌మేన్ రీమేక్ అన్న టాక్ రావటంతో సూర్య భాయ్ క్యారెక్టర్‌లో ఎవరు నటిస్తున్నారన్న డిస్కషన్ మొదలైంది. సూర్య భాయ్ రోల్‌కు మహేష్ సూట్ అయినంత పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే నార్త్ హీరో ఎవరా అని సెర్చ్ లైట్ వేసి మరీ జల్లెడ పడుతున్నారు ఇండస్ట్రీ జనాలు. ఆల్రెడీ పూరి తెరకెక్కించిన పోకిరి సినిమాను వాంటెడ్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు సల్మాన్ ఖాన్. దీంతో సల్మానే బిజినెస్‌మేన్ అయ్యే ఛాన్స్ ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ పోకిరి క్యారెక్టర్‌కు సెట్ అయినంత పర్ఫెక్ట్‌గా సూర్యభాయ్ క్యారెక్టర్‌కు సల్మాన్ సెట్ అవుతారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ సల్మాన్ కాకపోతే అజయ్ దేవగన్ ఈ రోల్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతారన్న వర్షన్ కూడా వినిపిస్తోంది. సీరియస్ యాటిట్యూడ్‌ను అజయ్ పర్ఫెక్ట్‌గా క్యారీ చేస్తారన్నది అభిమానుల నమ్మకం. ఒకవేళ యంగ్ జనరేషన్ స్టార్స్‌తో సినిమా ప్లాన్ చేస్తే రణబీర్ అయితే బెస్ట్ అంటున్నారు నార్త్ ఆడియన్స్. మరి పూరి మనసులో ఎవరున్నారో చూడాలి.