Oke Oka Jeevitham: వెర్సటైల్ హీరో శర్వా కోసం రంగంలోకి దిగిన తమిళ్ స్టార్ హీరో..

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. మహానుభావుడు సినిమా తర్వాత శర్వా కు హిట్ పడలేదు.

Oke Oka Jeevitham: వెర్సటైల్ హీరో శర్వా కోసం రంగంలోకి దిగిన తమిళ్ స్టార్ హీరో..
Oke Oka Jeevitham
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 26, 2022 | 9:22 PM

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. మహానుభావుడు సినిమా తర్వాత శర్వా కు హిట్ పడలేదు. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా శర్వా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు 30వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం(Oke Oka Jeevitham). నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగు అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.

మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటివలే విడుదలైన ”ఒకటే కదా” పాట సూపర్ హిట్ అయ్యింది. అన్నీ మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ పై ట్రెండింగ్ లో నిలిచింది. తాజాగా ఈ చిత్రం నుండి ”మారిపోయే” అనే పాటని విడుదల చేశారు. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే స్టార్ హీరో కార్తీ స్పెషల్ ఎప్పిరియన్స్ లో కనిపించి, స్వయంగా ఆయనే పాడి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. ‘నేనే పాడుతున్నా” అంటూ తనదైన శైలిలో అభిమానులని, ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు కార్తీ.

జేక్స్ బిజోయ్ ఈ పాట కోసం ట్రెండీ క్యాచి ట్యూన్ ని కంపోజ్ చేయగా, పాటకు కృష్ణచైతన్య అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ముఖ్యంగా కార్తి ఈ పాటని ఎనర్జిటిక్ గా పాడిన విధానం ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు సర్ ప్రైజ్ లు ఉంటానని చిత్ర యూనిట్ ఇంతకుముందే చెప్పింది. చెప్పినట్లే కార్తి పాటతో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. అమ్మ పాట, ఒకటే కదా పాటలు ట్రెండింగ్ లో వుండగా.. ఇప్పుడు విడుదలైన కార్తీ ప్రమోషనల్ సాంగ్ మరింత జోష్ ని ఇచ్చింది. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే