ఉప్పెనలో ఆ సీన్‌ చేయలేక అందరి ముందే ఏడ్చేశా !!

ఉప్పెనలో ఆ సీన్‌ చేయలేక అందరి ముందే ఏడ్చేశా !!

Phani CH

|

Updated on: Aug 26, 2022 | 9:10 PM

ఉప్పెన సినిమాలో.. క్యూట్ అండ్ స్వీట్ బాయ్‌లా కనిపించే మెగా హీరో వైష్ణవ్ తేజ్.. ఆ ఒక్క సినిమాతోనే... సూపర్ స్టార్ గా మారిపోయారు.

ఉప్పెన సినిమాలో.. క్యూట్ అండ్ స్వీట్ బాయ్‌లా కనిపించే మెగా హీరో వైష్ణవ్ తేజ్.. ఆ ఒక్క సినిమాతోనే… సూపర్ స్టార్ గా మారిపోయారు. సూపర్ స్టార్ గా మారిపోవడమే కాదు… రంగరంగవైభవం సినిమా తో త్వరలో మన ముందుకు రాబోతున్నారు కూడా..! ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ పనులు మొదలెట్టని వైష్ణవ్ తేజ్‌…తాజాగ ఓ ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఉప్పెన షూటింగ్ లో ఓ సీన్ చేయలేక ఏడ్చేశా అంటూ,,, అప్పటి విషయాన్ని అందరితో పంచుకున్నారు వైష్ణవ్. “ఉప్పెన షూటింగ్ సమయంలో ఓ సన్నివేశంలో కృతిశెట్టితో ఓ డైలాగ్ చెప్పాలి. నీకో మాట చెప్పా‏లి బేబమ్మ అంటూ కాస్త ఎమోషనల్‏గా మాట్లాడాలి. ఎందుకో తెలియదు ఆ క్షణం నాకు మాటలు రాలేదు. ఎమోషన్స్ పండించలేకపోయాను. అప్పటికే 20 టేక్స్ తీసుకున్నాను. ఆ సీన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అందరి సమయాన్ని, డబ్బును వృథా చేస్తున్నానని బాధ వేసింది. దీంతో ఒక్కసారిగా కన్నీళ్ళు వచ్చేశాయి” అని చెప్పుకొచ్చారు వైషూ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రేపు ఏం జరుగుతుందో తెలీదు !! అందుకే రెండో పెళ్లి..

Brahmastra: నాగార్జున, రాజమౌళితో కలిసి సౌత్ ఇండియన్ ఫుడ్ ను రుచి చూసిన రణబీర్

హోంవర్క్ అడిగిన టీచర్ కు.. స్టూడెంట్ నుంచి అదిరిపోయే ఆన్సర్‌ !!

ఆ రాష్ట్రాల్లో మహిళలకే ఎక్కువ మంది సెక్స్‌ పార్ట్‌నర్లు !! జాతీయ సర్వేలో బట్టబయలు

గర్ల్ ఫ్రెండ్ ముందు హీరోయిజం చూపించాలనుకున్నాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగిపోయింది

 

Published on: Aug 26, 2022 09:10 PM