రేపు ఏం జరుగుతుందో తెలీదు !! అందుకే రెండో పెళ్లి..

రేపు ఏం జరుగుతుందో తెలీదు !! అందుకే రెండో పెళ్లి..

Phani CH

|

Updated on: Aug 26, 2022 | 9:08 PM

కన్నడ స్టార్‌ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణంతో మానసికంగా కుంగిపోయారు ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్‌ . ఓ సినిమా షూటింగ్‌లో మొదటిసారి కలుకున్న వీరిద్దరు ఆ తర్వాత పదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు.

కన్నడ స్టార్‌ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణంతో మానసికంగా కుంగిపోయారు ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్‌ . ఓ సినిమా షూటింగ్‌లో మొదటిసారి కలుకున్న వీరిద్దరు ఆ తర్వాత పదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు. పెద్దల ఆశీర్వాదంతో 2018 మే 2న పెళ్లిపీటలెక్కారు. వీరి ప్రేమబంధానికి ప్రతీకగా ఓ పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే మేఘనా గర్భం దాల్చిన కొన్ని నెలలకే చిరంజీవి సర్జా 2020 జూన్‌ 7న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో భర్త జ్ఞాపకాల్లోనే బతుకుతూ కొన్ని రోజులు ఇంటికే పరిమితమయ్యారు మేఘన. అయితే అదే ఏడాది రాయన్‌రాజ్‌ సర్జా పుట్టడంతో తన భర్త ప్రతిరూపమైన కుమారుడి ఆలనాపాలనా చూసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే మేఘన రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వదంతులపై స్పందించిన మేఘన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Brahmastra: నాగార్జున, రాజమౌళితో కలిసి సౌత్ ఇండియన్ ఫుడ్ ను రుచి చూసిన రణబీర్

హోంవర్క్ అడిగిన టీచర్ కు.. స్టూడెంట్ నుంచి అదిరిపోయే ఆన్సర్‌ !!

ఆ రాష్ట్రాల్లో మహిళలకే ఎక్కువ మంది సెక్స్‌ పార్ట్‌నర్లు !! జాతీయ సర్వేలో బట్టబయలు

గర్ల్ ఫ్రెండ్ ముందు హీరోయిజం చూపించాలనుకున్నాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగిపోయింది

వందల అడుగల ఎత్తులో విమానం !! గాల్లోనే పుష్పప్స్ చేసిన యువతి !!

 

 

Published on: Aug 26, 2022 09:08 PM