వందల అడుగల ఎత్తులో విమానం !! గాల్లోనే పుష్పప్స్ చేసిన యువతి !!
స్కైడైవింగ్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. హెల్మెట్స్ ధరించి.. శరీరానికి రక్షణ కల్పించే దుస్తులు ధరించి ఎత్తైన ప్రదేశాల నుంచి దూకడమంటే అద్భుతమనే చెప్పుకోవాలి.
స్కైడైవింగ్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. హెల్మెట్స్ ధరించి.. శరీరానికి రక్షణ కల్పించే దుస్తులు ధరించి ఎత్తైన ప్రదేశాల నుంచి దూకడమంటే అద్భుతమనే చెప్పుకోవాలి. ఇటీవల సోషల్ మీడియాలో ఎత్తైన ప్రదేశాల నుంచి స్కైడైవింగ్ చేసే వీడియోస్ తెగ హల్‌చల్ చేస్తున్నాయి . తాజాగా అలాంటి మరో వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లకు వణుకు పుట్టిస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి వందల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానంపైనుంచి పుషప్స్ చేస్తూ స్కైడైవింగ్ చేసింది. ఆగస్ట్ 1న వాసెనినా అనే ఇన్ స్టా పేజీలో ఈ వీడియో షేర్ చేస్తూ.. వర్కవుట్ చేయడానికి ఏకైక మార్గం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వందల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం నుంచి ఓ అమ్మాయి బయటకు వచ్చి.. గాల్లో విమానాన్ని పట్టుకుని పుషప్స్ చేసింది. తర్వాత చూస్తుండగానే విమానాన్ని వదిలేసి గాల్లోకి దూకింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్వే ట్రాక్‌పై వ్యక్తి వాకింగ్ !! పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా
ఈ రైతు ఆలోచనకు హ్యాట్సాఫ్ !! కోటిన్నర డ్రీమ్ హౌస్‌ను కూల్చకుండా ఏం చేశాడంటే